Fri Dec 20 2024 18:16:09 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : నేడు సెమీ ఫైనల్స్ .. ఇండియా vs ఇంగ్లండ్
టీ 20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. నేడు సెమీ ఫైనల్స్ భారత్ తో ఇంగ్లండ్ తలపడుతుంది
టీ 20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. నేడు సెమీ ఫైనల్స్ భారత్ తో ఇంగ్లండ్ తలపడుతుంది. జార్జ్‌టౌన్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ ఇప్పటి వరకూ అపజయం ఎరగకుండా వరస విజయాలతో సెమీ ఫైనల్స్ కు దూసుకు వచ్చింది. ఇంగ్లండ్ తడబడుతూ ఒక్కసారి తేరుకుని అది కూడా సెమీ ఫైనల్స్ కు ప్రవేశించింది.
సమ ఉజ్జీలుగా ...
సెమీ ఫైనల్స్ లో ఇరు జట్లు 2022 తర్వాత తలపడుతుండటంతో అందరి కళ్లూ ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. నాడు భారత్ ను ఇంగ్లండ్ ఓడించింది. నేడు ఇంగ్లండ్ ను సెమీ ఫైనల్స్ లో ఓడించి కసితీర్చుకోవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. మొత్తం మీద ఇరు జట్లు బలంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమఉజ్జీల మధ్య పోరు కావడంతో ఆసక్తిగా మ్యాచ్ సాగనుంది.
Next Story