Sun Nov 17 2024 23:37:11 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : గ్రూపులో బలమైనది భారత్ మాత్రమేనట.. గెలుపుపై అంచనాలివీ
టీ 20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూన్ రెండో తేదీ నుంచి ప్రపంచ దేశాల మధ్య సమరం స్టార్ట్ అవుతుంది
టీ 20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూన్ రెండో తేదీ నుంచి ప్రపంచ దేశాల మధ్య సమరం స్టార్ట్ అవుతుంది. దాదాపు ఇరవై దేశాలు ఈ పోటీలో తలపడనున్నాయి. అందులో ఏ గ్రూపులో భారత్ ఉంది. అయితే ఈ గ్రూపులో ఉన్న మ్యాచ్ లో భారత్ తలపడుతుంది. గ్రూప్ ఎలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉన్నాయి. ఇండియా కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయింది. ఈ నేపథ్యంలో భారత్ ఈ జట్లపై గెలుపోటములపై అంచనాలు ఎలా ఉన్నాయన్నది మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది.
వాతావరణం, పిచ్ లు...
టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లన్నీ అమెరికా, వెస్టిండీస్ లలో జరగనున్నాయి. ఈ పిచ్ లు అలవాటయినవే. మైదానాల విషయంలో పెద్దగా టీం ఇండియా ఇబ్బంది పడే అవకాశాలు లేవు. వాతావరణం పరంగా కూడా అలవాటయిన జట్టునే భారత్ ఎంపిక చేయడంతో ఆ విషయంలో కూడా ఎలాంటి సందేహాలు అవసరం లేదు. గతంలో వెస్టిండీస్ పై అనేక మ్యాచ్ లలో విజయాలు సాధించిన చరిత్ర టీం ఇండియా కు ఉంది. అందుకే వాతావరణం, పిచ్ ల పరంగా టీం ఇండియా విషయాల్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మనోళ్లు సులువుగానే వాతావరణానికి అలవాటుపడిపోతారు. అక్కడి పిచ్ లు కూడా అలవాటయినవే కావడంతో ఆ రకమైన ఇబ్బందులు ఏమీ లేవన్నది క్రీడా పండితుల విశ్లేషణగా వినిపిస్తుంది.
ఎ గ్రూప్ లో ఉన్న...
జూన్ 5వ తేదీన న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా తలపడనుంది. జూన్ 5వ తేదీన న్యూయార్క్ లో ఐర్లాండ్ తో టీంఇండియా పోటీ పడుతుంది. తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9న పాకిస్థాన్ తో, జూన్ 12న అమెరికాతో ఆడనుంది. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్ ను జూన్ 15న కెనడాతో తలపడుతుంది. భారత్ ఏ గ్రూపులోని నాలుగు దేశాలతో ఆడనుండగా వాటిలో ఐర్లాండ్, పాకిస్థాన్ కొంత బలంగా కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ ను తక్కువగా అంచనా వేయలేమని చెబుతున్నారు. అది చిన్న దేశమని తక్కువ చేసి చూడలేం. ఒక్కసారిగా అది విజృంభించి ఆటలో పై చేయి సాధించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అందుకే ఐర్లాండ్ తో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.
పాక్ తోటే కొంత...
ఇక దాయాది దేశమైన పాకిస్థాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాక్ తో ఆట అంటే భారత్ కు ఎంత టెన్షనో అంతే టెన్షన్ ఆ దేశ జట్టుకు కూడా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పాక్ తో ఆట అంటే ఇరు దేశాలకు ఎంత ఉత్కంఠ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే లెక్కల పరంగా చూస్తే పాక్ కన్నా భారత్ జట్టు టీ 20లలో బలంగా కనిపిస్తుందని క్రీడా విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. మిగిలిన కెనడా, అమెరికా జట్లపై భారత్ గెలుపు నల్లేరు పై నడకే అవుతుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద టీ 20 ప్రపంచకప్ లో భారత్ దే పై చేయిగా కనిపిస్తుంది. మరి మైదానంలో మనోళ్లు ఏం చేస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది.
Next Story