Mon Dec 23 2024 10:23:46 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : అనుభవం ఒకటే కాదు భయ్యా...దూకుడు బ్యాచ్ కావాలి మాకు
టీ 20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. టీం ఇండియా ఈసారి బలంగానే బరిలోకి దిగుతుంది.
టీ 20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. టీం ఇండియా ఈసారి బలంగానే బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న వారినే ఎంపిక చేసింది. ఎందుకంటే ఐపీఎల్ మే 25వ తేదీన ముగిసింది. టీ 20 వరల్డ్ కప్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. అంటే పెద్దగా సమయం లేదు. అంటే ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసి ఈసారి బీసీసీఐ ఒక ప్రయోగం చేసిందనే చెప్పాలి. కొడితే కొట్టాలిరా కప్ అన్నట్లు ఒకరకంగా జట్టును కూర్పు చేయడంలో అన్ని రకాలుగా అంచనాలు వేసి మరీ ఎంపిక చేసింది. సీినియర్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్ వంటి వారిని కూడా పక్కన పెట్టడానికి వెనకాడలేదు.
గ్రౌండ్ లో ఎవరు?
కేవలం అనుభవం ఒక్కటే సరిపోదు భయ్యా.. గ్రౌండ్ లో ఆ ఆ టైంకి దూకుడు ఉంటేనే విజయం అన్న భావనతోనే ఎంపిక చేసింది. అయితే వరల్డ్ కప్ లో చోటు దక్కని వాళ్లు మంచి ఆటగాళ్లు కాదని కాదు కానీ.. వాళ్లకంటే ఒకింత మెరుగైన ఆటతీరును కనపర్చే అవకాశాలుండటంతోనే ఈ ఎంపిక చేసిందను కోవాలి. తురుంఖాన్ లు అనుకున్న వాళ్లు కూడా ఆడాల్సిన సమయంలో బ్యాట్ ను ఎత్తేస్తారు. అలాగే అంచనాలు లేని ఆటగాళ్లు జట్టుకు విజయాలను అందిస్తుంటారు. అది ఆట కాబట్టి ఎవరు ఎప్పుడైనా రాణించవచ్చు. అందుకే ఎవరు ఎప్పుుడు ఎలా రెచ్చిపోతారో చెప్పలేం. ఒకరిపైన ఎక్స్పెక్టేషన్లు కూడా పెట్టుకోవడం అనవసరం.
అందరూ హిట్టర్లే...
ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఐదు ఓవర్లుంటే చాలు ఇక పరుగుల వరద పారినట్లే. అలాగే మిగిలిన ఆటగాళ్లు కూడా మైదానంలో వీరవిహారం చేస్తే ఎవరికీ అందదు. సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. వీళ్లతో పాటు యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రిత్ బూమ్రా, సిరాజ్ లు ఉన్నారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె, సంజూ శాంసన్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా వంటి వాళ్లు మంచి హిట్టర్లు. అందుకే మన బ్యాటింగ్ బలంగా ఉంది.
బౌలింగ్ పరంగా కూడా...
అలాగే బౌలింగ్ కూడా ఈసారి బలంగా ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. హార్ధిక్ పాండ్యా, సిరాజ్ లతో పాటు స్పిన్ తో మ్యాచ్ ను మలుపు తిప్పే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ వంటి వారున్నారు. అర్హదీప్ సింగ్ డెత్ ఓవర్లలో కొంత ఇబ్బంది పడినా, పరుగులు ఎక్కువ ఇచ్చినప్పటికీ అవసరమైన సమయంలో వికెట్లు తీస్తారన్న అభిప్రాయం ఉంది. ఇలా బౌలింగ్ పరంగా కూడా బలిష్టంగా ఉండటంతో పరుగులు ఇచ్చినా వికెట్లు తీయడంలో మాత్రం మనోళ్లు గట్టోళ్లే. అయితే బౌలర్లపై వత్తిడి తేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉందన్నది వాస్తవం. ముందుగా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేస్తే సరి.. లేదంటే.. మాత్రం తొలుత భారత్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మంచి స్కోరు కనుక చేస్తే బౌలర్లపై వత్తిడి తగ్గి బాల్ వారి చేతుల్లో తిరుగుతుందన్నది కూడా అంతే వాస్తవం. చూద్దాం మరి మనోళ్లు ఏం చేస్తారో?
Next Story