Mon Dec 23 2024 05:33:04 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : గెలుపును చూసి ఒక్కసారిగా ఉబికి వస్తున్న నీటిని ఆపుకోలేకపోయాడుగా
రోహిత్ శర్మ ఇంగ్లండ్ పై విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు
ఎవరికైనా అంతే.. చూసే వారికే అలా ఉంటే.. ఇక ఆడేవారికి ఎలా ఉంటుంది? అందులోనూ టీం ఇండియా కెప్టెన్ పరిస్థితిని ఎవరైనా ఊహించుకోవచ్చు. తన నాయకత్వంలో ఒక్కసారి అయినా కప్ కొట్టాలని మాత్రం ఎవరికి ఉండదు. అందుకు సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ చేరాల్సిన అవసరం ఉంటుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది.
ప్రతీకారాన్ని తీర్చుకుని...
2022లో ఇంగ్లండ్ తమను ఓడించిన ప్రతీకారాన్ని ఇప్పుడు భారత్ తీర్చుకున్నట్లయింది. అయితే ఇంగ్లండ్ ను ఇంత సులువుగా ఓడించగలమని ఎవరూ అంచనా కూడా వేయలేదు. ఈ వరల్డ్ కప్ లో తిరుగులేకుండా విజయాలను ఆస్వాదిస్తూ వస్తున్న రోహిత్ శర్మ ఇంగ్లండ్ పై విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కంటి నుంచి వస్తున్న నీటిని అదుపు చేసుకోలేకపోయాడు. ఇది గమనించిన విరాట్ కోహ్లి "కమాన్ మ్యాచ్ ఛీర్స్" అంటూ రోహిత్ భుజం తట్టాడు. సముదాయించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రేపు కూడా ఇలాగే ఆడి...
నిజానికి ఇంగ్లండ్ జట్టు ను ఎవరూ తక్కువగా అంచనా వేయలేదు. వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి ప్రవేశించాలంటే సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. 171 పరుగులు చేసిన భారత్ పెద్ద లక్ష్యాన్ని విధించకపోయినప్పటికీ మన బౌలర్లు అందులోనూ స్పిన్నర్లు ఇద్దరూ రాణించడంతో 68 పరుగులతో గెలుపు సాధ్యమయింది. దీంతో రోహిత్ వెంట కన్నీరు జలలల కారాయి. అవి ఆనంద భాష్పాలు. అవును.. కెప్టెన్ అయినా ఆ సమయంలో భావోద్వేగానికి గురికావడం సర్వసాధారణమే. ఫైనల్స్ లోనూ ఇదే విధంగా రాణించి భారత్ కు కప్ తెచ్చి పెట్టండి భయ్యా అంటూ నెటిజన్లు ఈ వీడియో చూసి కామెంట్స్ పెడుతున్నారు. రేపు వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనుంది. సౌతాఫ్రికాతో భారత్ ఫైనల్స్ లో తలపడుతుంది.
Next Story