Mon Dec 23 2024 04:27:28 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : ముందుంది అసలు ఫెస్టివల్... అంత సులువైన పనేనా?
టీం ఇండియా వరల్డ్ కప్ లో సూపర్ 8 లోకి ప్రవేశించింది. వరసగా మూడు విజయాలతో అన్స్టాపబుల్ విక్టరీలతో ముందుకు వెళుతుంది.
టీం ఇండియా వరల్డ్ కప్ లో సూపర్ 8 లోకి ప్రవేశించింది. వరసగా మూడు విజయాలతో అన్స్టాపబుల్ విక్టరీలతో ముందుకు వెళుతుంది. దీంతో సూపర్ 8 లో మాత్రం భారత్ కు అంత సులువు కాదు. టీం ఇండియా రేపు కెనడాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా మీద గెలిచి ఊపుమీదున్న టీం ఇండియా నాలుగో మ్యాచ్ గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. రేపు కెనడాతో జరిగే మ్యాచ్ లోనూ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో అగ్రభాగాన నిలుస్తుంది. అయితే ఇదే ఇప్పుడు గతం తలచుకుని భయపడాల్సి వస్తుంది.
అన్నింటా విజయం సాధించి...
వన్డే వరల్డ్ కప్ లోనూ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి ఫైనల్స్ లో మనోళ్లు చేతులెత్తేసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అన్నింటా విజయం సాధించి అసలు మ్యాచ్ కు వచ్చే సరికి చేతులెత్తేస్తారేమోనన్న ఆందోళన భారత్ అభిమానుల్లో ఉంది. అందుకే ఈ గుబులు. కెనడాతో మ్యాచ్ గెలిచినా, ఓడినా సూపర్ 8 కి మాత్రం భారత్ వెళుతుంది. అయితే ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆప్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్ లు సూపర్ 8 కు చేరుకున్నాయి. సూపర్ 8కి చేరిన మూడో జట్టుగా టీం ఇండియా నిలవడంతో అది ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.
నాలుగు జట్లతో...
ఆస్ట్రేలియాతో పాటు సూపర్ 8లోనూ టీం ఇండియా మరో మూడు జట్లతో ఆడనుంది. అందుకే ఆస్ట్రేలియా మ్యాచ్ లో గెలుపోటములపై ప్రభావం చూపకపోయినా ఇక్కడి నుంచి అసలు ఆట ప్రారంభమవుతుందంటున్నారు. ఇప్పటి వరకూ ఒక ఎత్తు.. ఇకపై మరొక ఎత్తుగా ఆడాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ఇకపై జరిగే మ్యాచ్ లన్నీ వెస్టిండీస్ లోనే జరుగుతుండటంతో అక్కడి పిచ్ లు కొంత అలవాటుగా ఉండటంతో టీం ఇండియా బ్యాటర్లు ఫామ్ లోకి వచ్చే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సూపర్ 8 లో మొత్తం టీం ఇండియా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా అన్ని మ్యాచ్ లు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అందుకు టీం ఇండియా మాత్రం చాలా వరకూ కష్టపడాల్సిందే. చెమటోడాల్సిందే.
Next Story