Sun Dec 22 2024 19:45:48 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Finals 2023 : వరస గెలుపులు చూసి అప్పుడే డౌట్ వచ్చింది.. ఫైనల్ లో కొంపముంచింది
వరల్ట్ కప్ లో టీం ఇండియా ఓటమి పాలయింది. ఆస్ట్రేలియా విజయం సాధించింది.
పన్నెండేళ్ల కల చెదిరింది. ఈ వరల్డ్ కప్ ను ఇండియా కైవసం చేసుకంటుందని హోప్స్ పెట్టుకున్న వారందరికీ నిరాశ మిగిలింది. వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా గెలిచింది. ఏడు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ముద్దాడింది. తొలి ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడిపోయినా ఆస్ట్రేలియా బ్యాటర్లు హెడ్, లబూషేన్ లు నిలకడగా ఆడి ఆసీస్ ను గెలిపించారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత్ బౌలర్లు అనేక తంటాలు పడ్డారు. షమి ఒకటి, బూమ్రా రెండు వికెట్లు తీశారు. అయినా ఆస్ట్రేలియా ఎదుట తక్కువ పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచడంతో వారికి గెలుపు సులువుగా మారింది.
తక్కువ స్కోరుకు...
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బంతిని ఎదుర్కొనలేక భారత్ బ్యాటర్లు దాదాపు అందరూ తడబడ్డారు. రోహిత్ శర్మ 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. శుభమన్ గిల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లి నిలదొక్కుకున్నట్లు కనిపించినా అర్థసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుటయ్యాడు. దీంతో స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు కొద్దిగా చక్కదిద్దే ప్రయత్నం చేసినా అత్యధిక పరుగులు సాధించలేకపోయారు.
అర్థ సెంచరీలు చేసినా...
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో చివరకు టీం ఇండియా అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. యాభై ఓవర్లకు 240 పరుగులు చేసి తక్కువ లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది. ఆసిస్ బ్యాటర్లు తొలి మూడు వికెట్లు కోల్పోయినా కంగారు లేకుండా నిదానంగానే లక్ష్యాన్ని చేరడంలో సక్సెస్ అయ్యారు. భారత్ బౌలర్ల శ్రమ ఫలించలేదు. ఫలితంగా చేతికి అందుతున్న వరల్డ్ కప్ కంటి ముందే చేజారి పోయింది. బ్యాడ్ లక్ ఇండియా.
Next Story