Fri Nov 22 2024 20:03:32 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Semi Finals 2023 : వజ్రమయ్యా నువ్వు.. ఏమని వర్ణించమూ...?
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లి సెంచరీ చేశాడు.
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లి సెంచరీ చేశాడు. తన యాభైవ సెంచరీని ముంబయి వాంఖడే స్టేడియంలో పూర్తి చేసుకుని రికార్డును బ్రేక్ చేశాడు. మొన్న సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లి ఇప్పుడు దానిని దాటిపోయి తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీతో భారత్ అభిమానుల ఆనందాలకు అవధులు లేవు. స్టేడియం మొత్తం మారు మోగిపోయింది. విరాట్ కు సలాం చేసింది. కామెంటేటర్లు సయితం కోహ్లిని చాలాసేపు పొగుడుతూనే ఉండిపోయారు.
అదొక భరోసా...
విరాట్ కోహ్లి ఉంటేనే ఒక భరోసాగా అనిపిస్తుంది. నిలదొక్కుకుంటే చాలు ఇక అంతే. ఇరవై ఐదు పరుగులు దాటితే ఫిఫ్టీ గ్యారంటీ. డెబ్బయి పరుగులు దాటాడంటే సెంచరీ పూర్తి చేసుకున్నట్లే. అలా ఉంటది కోహ్లితోనే. అవుటయితే వెంటనే అవుటయి పెవిలియన్ కు వెళ్లిపోతాడు. ఉండిపోతే మాత్రం అర్థ సెంచరీయో.. సెంచరీయో చేసేంత వరకూ ఆడుతూనే ఉంటాడు. విరాట్ పరుగులు ఆపడు. అలసట ఉండదు. వికెట్ల మధ్య పరుగుల వేగం ఏమాత్రం తగ్గదు. అదే అతని స్పెషాలిటీ.
యాభై సెంచరీల రికార్డు...
ఈ వరల్డ్ కప్ లోనే యాభై సెంచరీల రికార్డును నమోదు చేసిన విరాట్ కోహ్లి ఇండియాకు దొరికిన ఒక అమూల్యమైన బంగారు తునక. క్రికెట్ అంటే తెలియని వాళ్లు సయితం విరాట్ వీరంగం చూసి ఆటకు ఫిదా అయిపోయినోళ్లు చాలా మంది ఉన్నారంటే నమ్మశక్యం కాదు. ఈ వరల్డ్ కప్ లోనే తృటిలో సెంచరీ మిస్ చేసుకున్న విరాట్ కోహ్లి కీలకమైన సెమీ ఫైనల్స్ మాత్రం ఆ ఛాన్స్ వదులుకో దలచుకోలేదు. శ్రేయస్ అయ్యర్ తో కలిసి స్కోరు పెంచుతూనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Next Story