Thu Dec 19 2024 22:55:26 GMT+0000 (Coordinated Universal Time)
World Cup Semi Finals 2023 : ఫైనల్స్‌కు టీం ఇండియా.. షమి వల్లనే ఈ గెలుపు
వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్‌కు టీం ఇండియా షాకిచ్చింది ఇండియా ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది.
వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో న్యూజిలాండ్‌కు టీం ఇండియా షాకిచ్చింది. ఇండియాపై న్యూజిలాండ్ ౭౦ పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కానీ చివర వరకూ టెన్షన్ తప్పలేదు. మిచెల్ అవుట్ అయిన తర్వాతనే టీం ఇండియా విజయం ఖరారయింది. తొలి పది ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొడితే న్యూజిలాండ్ కష్టాల్లో పడిందని భావించాం. కానీ ఇద్దరు బ్యాటర్లు నిలదొక్కుకున్నారు. . కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ లు భారత్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. సిక్సర్లు, ఫోర్లతో స్కోరును పరుగులు తీయించారు. వారి భాగస్వామ్యాన్ని విడదీయడం భారత్ బైలర్ల వల్ల కాలేదు. ముప్ఫయి ఓవర్లు ఇద్దరూ నిలబడి టీం ఇండియా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతూనే ఉన్నారు.
మళ్లీ రిపీట్ అవుతుందని భయపడి...
2019 లో జరిగినట్లుగానే మళ్లీ భారత్ న్యూజిలాండ్ చేతిలో పరాభవం పాలవుతుందని అనుకున్నం. చేయాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉన్నా మిచెల్, విలియమ్సన్ లు క్రీజుకు అతుక్కుపోవడంతో ఇండియాకు పరాజయం తప్పదని అందరూ భావించారు. అయితే డెత్ ఓవర్లలో భారత్ కు వాతావరణం అనుకూలంగా మారింది. బౌలర్లు వికెట్లు తీస్తూ న్యూజిలాండ్ ను చావుదెబ్బ తీశారు. దీంతో టీం ఇండియా కాలర్ ఎగరేసి ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. డెత్ ఓవర్లలో అత్యధిక పరుగులు ఇవ్వడంతో ఒక దశలో న్యూజిలాండ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. దానివైపు విజయం మొగ్గు చూపించే విధంగా అనిపించింది.
మళ్లీ ఆదుకున్న షమి...
షమి సెకండ్ స్పెల్ లో మరోసారి విలియమ్సన్ వికెట్ తీయడంతో మళ్లీ ఆశలు పెరిగాయి. కొద్దిసేపటికే లాథమ్ వికెట్ ను కూడా తీసి షమీ న్యూజిలాడ్ నడ్డి విరిచాడు. మిచెల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత్ బౌలర్లలో షమి ఒక్కడే ఏడు వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన ఫిలిిప్స్ కూడా నిలదొక్కుకుని ఆడుతుండటతో మ్యాచ్ మళ్లీ టర్న్ అయింది. రన్ రేటు ఎక్కువగా ఉన్నా డేంజరస్ బ్యాట్స్‌మెన్ మిచెల్ ఉండటంతో చివర వరకూ విజయం ఊగిసలాట ఆడింది, డెత్ ఓవర్లలో టీం ఇండియా బౌలర్లు తడబాటు పడటం కూడా టెన్షన్ పెట్టింది. దూకుడు మీదున్న ఫిలిప్స్ వికెట్ ను బుమ్రా తీయడంతో కొంత రిలీఫ్ వచ్చింది. కులదీప్ యాదవ్ తన చివరి ఓశర్లో చాప్మాన్ ను అవుట్ చేయడంతో మళ్లీ న్యూజిలాండ్ పై వత్తిడి పెరిగింది.
న్యూజిలాండ్ బ్యాటర్లు...
రన్ రేటు ఎక్కువగా ఉండటం భారత్ కు కలసి వచ్చే అంశంగా మారింది. వికెట్లు ఎక్కువగా పడిపోతుండటంతో న్యూజిలాండ్ చివరి వరకూ పోరాడింది. షమి మిచెల్ ను అవుట్ చేయడంతో మ్యాచ్ ఇండియా వైపు మళ్లింది. అలా న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుకు షమీయే కారణమని చెప్పకతప్పదు. కీలకమైన వికెట్లు సరైన సమయంలో తీసుకుని విజయాన్ని భారత్ వైపు మళ్లించాడు. మొత్తం మీద బీపీ పెంచారు. టెన్షన్ పెట్టారు. చివరకు ఎట్టకేలకు ఫైనల్స్ లోకి అడుగు పెట్టారు. ఈ నెల 19న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ లో టీం ఇండియా ఆడనుంది.
Next Story