Mon Nov 18 2024 04:44:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బంగ్లాదేశ్ తో భారత్ ఢీ.. నాలుగో విజయం కోసం
టీం ఇండియా నేడు బంగ్లాదేశ్తో వరల్డ్ కప్లో తలపడనుంది. బంగ్లాదేశ్ చిన్న దేశమని చూస్తే భారత్ అభాసుపాలు కావాల్సి వస్తుంది
టీం ఇండియా నేడు బంగ్లాదేశ్తో వరల్డ్ కప్లో తలపడనుంది. బంగ్లాదేశ్ చిన్న దేశమని చూస్తే భారత్ అభాసుపాలు కావాల్సి వస్తుంది. వరల్డ్ కప్ లో ఇప్పటికే ఈ విషయాలు అనేకసార్లు రుజువయ్యాయి. చిన్న జట్లు పెద్ద జట్లను సులువుగా ఓడించాయి. ఇంగ్లాండ్ జట్టును ఆప్ఘనిస్తాన్ జట్టు దారుణంగా ఓడించింది. అలాగే నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది. ఇన్ని ఉదాహరణలు కళ్లముందు ఉన్నా కూడా ఇండియా అతి విశ్వాసానికి పోతే ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుందన్నారు. పూనేలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. భారీ స్కోరు నమోదయ్యే అవకాశముందని చెబుతన్నారు.
వరస విజయాలతో...
వరల్డ్ కప్ లో భారత్ ఇప్పటి వరకూ వరసగా మూడు వరస విజయాలతో పట్టికలో ప్రధమ స్థానంలో ఉంది. నాలుగో విజయం కోసం బంగ్లాదేశ్ పై శ్రమించాల్సి ఉంటుంది. ప్రయోగాలకు ఇది సమయం కాదన్నది నిపుణుల అభిప్రాయంగా వినిపిస్తుంది. జట్టు మంచి ఫామ్లో ఉంది. ఇదే ఫామ్ ను కొనసాగాలంటే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగడమే మంచిదన్న సూచనలు అందుతున్నాయి. అలా కాకుండా మార్పులు చేసి ఏదో చేద్దామనుకుని ప్రయత్నిస్తే ఏదో అయ్యే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
మార్పులు లేకుండానే...
భారత్ బలమైన జట్టే. బ్యాటింగ్ పరంగా అందరూ ఫామ్ లో ఉన్నారు. శుభమన్ గిల్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమైంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, జడేజా వరకు మన బ్యాటింగ్ కు ఢోకా లేదు. ఇక బౌలింగ్ పరంగా సిరాజ్, పాండ్యాతో పాటు శార్దూల్ ఠాకూర్, స్పిన్నర్లు కులదీప్ యాదవ్, జడేజాలు ఉంటే భయమెందుకన్నది ప్రతి అభిమాని అనుకునేదే. కానీ బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదంటున్నారు. అందుకే ప్రయోగాలకు పోకుండా సరైన కూర్పుతో నేర్పుతో జట్టు సమన్వయంతో నాలుగో మ్యాచ్ ను కూడా గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
Next Story