Mon Dec 23 2024 04:50:37 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్
టీం ఇండియా సూపర్ 8 లో నేడు మరో మ్యాచ్ ఆడనుంది. ఈరోజు భారత్ బంగ్లాదేశ్ లో తలపడుతుంది
టీం ఇండియా సూపర్ 8 లో నేడు మరో మ్యాచ్ ఆడనుంది. ఈరోజు భారత్ బంగ్లాదేశ్ లో తలపడుతుంది. సూపర్ 8లో తొలి మ్యాచ్ ఆప్ఘనిస్థాన్ పై ఆడి విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. బంగ్లాదేశ్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే అనేక సంచలనాలకు మారుపేరు బంగ్లాదేశ్ జట్టుకు పేరుంది. అందుకే ఆచితూచి ఆడాల్సి ఉంటుండి. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా కనిపిస్తున్నా మైదానంలో ఆరోజు ఆడే విధానాన్ని బట్టి ఉంటుంది.
బంగ్లా కూడా బలంగానే...
ఏ మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నార్త్ సౌండ్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ఆడుతుంది. భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే మరింత ఉత్సాహంతో ముందుకేసే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఆస్ట్రేలియాపై ఓటమి పాలయిన బంగ్లాదేశ్ కసిమీద ఉండటంతో దానిని కట్టడి చేయడానికి మన బౌలర్లు ఏరకంగా శ్రమిస్తారన్నది చూడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story