Fri Dec 20 2024 14:23:04 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : బ్రేకుల్లేని బుల్లెట్ ట్రెయిన్ .. ఆరో మ్యాచ్...ఏమవుతుందో
టీం ఇండియా ఆరో మ్యాచ్ ఇంగ్లండ్ తో ఆడనుంది. వారం రోజుల విరామం అనంతరం మ్యాచ్ జరగనుంది
భారత్ కు దాదాపు వారం రోజులు విరామం వచ్చింది. ఈ నెల 22వ తేదీన న్యూజిలాండ్తో మ్యాచ్ భారత్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తిరిగి 29వ తేదీన ఇంగ్లండ్తో తలపడనుంది. వారం రోజుల పాటు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆటగాళ్లు తొలి రోజు విశ్రాంతి తీసుకున్నా తర్వాత నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ కూడా గంటల తరబడి చేయకుండా కొంత సమయం విశ్రాంతి తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. బీసీసీఐ ఈ మేరకు వారికి ఉపశమనం ఇచ్చినట్లు కనపడుతుంది.
ఆరో మ్యాచ్లో...
ఇప్పటికే భారత్ ఐదు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆరో మ్యాచ్ లో కూడా గెలిచేందుకు కూడా భారత్ కష్టపడాల్సి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ ఈ వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు. అలాగని తేలిగ్గా తీసుకుంటే అంతే. ఏమో మైదానంలో ఏమైనా జరగొచ్చు. ఇంగ్లండ్ కూడా పుంజుకుని తిరిగి ఫామ్ లోకి వచ్చిందంటే ఇండియా ఆరో విజయానికి బ్రేక్ పడుతుందన్న ఆందోళన అభిమానుల్లో లేకపోలేదు.
తగిన జాగ్రత్తలు...
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ చెప్పినట్లు టీం ఇండియా బ్రేకుల్లేని బుల్లెట్ ట్రైయిన్లా పరుగులు తీస్తుందని అనడంలో అర్థముంది. అంటే దాని అర్థం ఎక్కడైనా క్రాష్ కావచ్చని. వసీం అక్రమ్ ఏ అర్థంతో ఆ మాట అన్నప్పటికీ టీం ఇండియా మాత్రం ఇంగ్లండ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్రీడానిపుణులు సూచిస్తున్నారు. ఇదే టీంతో బరిలోకి దిగి ఫస్ట్ బ్యాటింగ్ అయితే మూడు వందలకు పైగా పరుగులు చేయాలని, లేకుంటే ఛేజింగ్ లో మరోసారి విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోసారి సన్డే కూడా సూపర్ సన్డే కావాలని టీం ఇండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Next Story