Fri Dec 27 2024 15:50:18 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : పాకిస్థాన్ కు మూడు గండాలు.. అది దాటితేనే సూపర్ 8కు ఛాన్స్
టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు టెన్షన్ పట్టుకుంది. ఈరోజు రాత్రి వర్షం పడకుండా బాబర్ సేన ప్రార్థనలు చేస్తుంది
టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు టెన్షన్ పట్టుకుంది. ఈరోజు రాత్రి వర్షం పడకుండా బాబర్ సేన ప్రార్థనలు చేస్తుంది. వర్షం పడి ఆట ఆగిపోతే మాత్రం పాకిస్థాన్ సూపర్ 8కు చేరుకోలేదు. ప్రపంచ కప్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి 8 గంటలకు అమెరికా ఐర్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ వర్షార్పణం అయితే పాకిస్థాన్ ఇంటికి వెళ్లక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే నాలుగు పాయింట్లతో అమెరికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. వర్షం వల్ల మ్యాచ్ ఆగితే మరొక పాయింట్ చేరి ఐదుకు చేరుతుంది. అయినా..అమెరికా ఐర్లాండ్ మీద గెలిచినా సరే పాక్ ఇక ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాల్సిందే.
వర్షం పడి...
అంటే మ్యాచ్ జరిగి అమెరికా ఐర్లాండ్ మీద గెలిచినా, వర్షం పడి మ్యాచ్ ఆగిపోయినా పాకిస్థాన్ కు గండమే. అందుకే ఈరోజు రాత్రికి బాబర్ సేన భవితవ్యం తేలనుంది. జూన్ 16వ తేదీన తన ఎ గ్రూపులో చివరి మ్యాచ్ ను ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఇప్పటికి పాకిస్థాన్ రెండు మ్యాచ్ లలో ఓడి ఒక మ్యాచ్ లో అది కెనడాతో గెలిచింది. అంటే రెండు పాయింట్లతో ఉంది. చివరి మ్యాచ్ గెలిచినా నాలుగు పాయింట్లకే పరిమితమవుతుంది. అమెరికా సూపర్ 8కు చేరుకుంటుంది. అంతే తప్ప పాకిస్థాన్ ఇక సూపర్ 8 కు చేరే ఛాన్స్ లేదు.
రాత్రి పది గంటలకు...
పాకిస్థాన్ ఇప్పుడు మూడు రకాల కోరికలతో ప్రార్థన చేయాల్సి ఉంది. ఒకటి .. ఈరోజు వర్షం పడకుండా మ్యాచ్ కొనసాగాలని కోరుకోవడం. మరొకటి ఈ మ్యాచ్ లో అమెరికా ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలు కావడం, మూడోది అలాగే ఆరోజు వర్షం పడకూడదని.. ఇలా.. ఈ నాలుగు కోర్కెలు తీరితేనే పాకిస్థాన్ సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. మూడింటిలో ఏ ఒక్కటీ జరగకపోయినా పాకిస్థాన్ ఇంటి దారి పట్టాల్సిందే. ఈరోజు అమెరికా - ఐర్లాండ్ మ్యాచ్ లో అమెరికా గెలిస్తే ఈరోజు పాక్ భవతవ్యం తేలిపోతుంది. ఫ్లోరిడాలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో పాక్ జట్టు గుప్పిట భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. మరి రాత్రి పది గంటలకు కానీ పాక్ భవితవ్యం తేలనుంది.
Next Story