Fri Dec 20 2024 08:12:01 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : విరాట్ కొహ్లీ ఆ మ్యాచ్ ఆడేందుకు అవకాశం లేదా?
టీ 20 వరల్డ్ కప్ కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు చేదువార్త తెలిసింది
టీ 20 వరల్డ్ కప్ కు ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు చేదువార్త తెలిసింది. విరాట్ కోహ్లి తొలి మ్యాచ్ పై ఆడతారా? లేదా? అన్న అనుమానం వ్యక్తమవుతుంది. విరాట్ కోహ్లి గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ 20 ప్రపంచ కప్ కోసం టీ ఇండియా జట్టు ఇప్పటికే అమెరికా బయలుదేరి వెళ్లింది. తొలి బ్యాచ్ లో కొందరి ఆటగాళ్లే న్యూయార్క్ కు చేరుకున్నారు. విరాట్ కోహ్లి మాత్రం అమెరికాకు వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోయారు.
సోషల్ మీడియాలో ...
దీంతో విరాట్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏమయిందని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లి చిన్న గాయం కారణంగా బాధపడుతున్నారని బీసీసీఐ తెలిపింది. వీలయినంత త్వరగానే జట్టుతో విరాట్ కలుస్తాడని చెప్పింది. తాను కొంచెం ఆలస్యంగా జట్టులో జాయిన్ అవుతానని విరాట్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ ఓకే చెప్పడంతో విరాట్ కోహ్లి ఈ నెల ఐదో తేదీన ఐర్లాండ్ తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లి హాజరుకావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్ట్ బ్యాచ్ లో...
ఇప్పటికే న్యూ యార్క్ చేరుకున్న ఫస్ట్ బ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, జస్ట్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తదితరులున్నారు. మిగిలిన వాళ్లు కూడా త్వరలో చేరకుంటారు. కోహ్లి మాత్రం చిన్న గాయంతో బాధపడుతున్న కారణంగా కొద్దిగా ఆలస్యంగా వస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అమెరికా వెళ్లే తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ నెల 5వ తేదీలోపు చేరుకోవాలని బీసీసీఐ విరాట్ కు చెప్పినట్లు తెలిసింది. కానీ అందుతున్న సమాచారం మేరకు రేపు విరాట్ కోహ్లి అమెరికా బయలుదేరే అవకాశముందని, బంగ్లాదేశ్ తో జరిగే వార్మప్ మ్యాచ్ లో పాల్గొనకపోవచ్చని బీసీసీఐ తెలిపింది.
Next Story