Mon Dec 23 2024 14:59:35 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : సారా టెండూల్కర్ మూమెంట్స్ ను క్యాచ్ చేస్తున్న కెమెరాలు... అందుకేనా?
శుభమన్ గిల్, టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.
శుభమన్ గిల్ ఆటలో చెలరేగిపోతున్నాడు. బ్యాటింగ్ పరంగా గిల్ ఉంటే ఇక పూర్తి భరోసా. మినిమమ్ హాఫ్ సెంచరీ గ్యారంటీ. మంచి షాట్లతో అందరినీ అలరిస్తున్నాడు. శుభమన్ గిల్ టీం ఇండియా ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే గిల్ మనసులో ఉన్న దెవరు? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శుభమన్ గిల్, టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న వార్తలు క్రికెట్ అభిమానులను మాత్రమే కాదు టెండూల్కర్ ఫ్యాన్స్ ను కూడా ఒకింత ఆశ్చర్యం కలిగించాయి. సచిన్ గారాలపట్టీ అయిన సారా నిజంగా శుభమన్ గిల్ తో లవ్ పడిందా? అన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.
స్టేడియంలో ప్రత్యేకంగా...
అయితే టీం ఇండియా మ్యాచ్ జరిగే చోట సారా టెండూల్కర్ ప్రత్యక్ష మవుతున్నారు. గ్యాలరీలో ఉండి మ్యాచ్ ను వీక్షిస్తున్నారు. తన తండ్రి క్రికెటర్ కావడంతో సహజ సిద్ధంగా ఆమెకు కూడా క్రికెట్ పై అభిమానం ఉండి ఉండవచ్చు. దానిని ఎవరూ కాదనలేరు. కానీ శుభమన్ గిల్ ఫోర్ బాదినప్పుడు సారా రెస్పాన్స్ చూడాలి. ఇక సిక్సర్ కొడితే సారా స్టేడియంలో ఉన్నానని కూడా మరచిపోయి గంతులేస్తారు. దీంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.
గిల్ అవులయినప్పుడు....
నిన్న ముంబయి వాంఖడే స్టేడియంలో తన తండ్రి సచిన్ టెండూల్కర్ తో వచ్చిన సారా ప్రత్యేకంగా గ్యాలరీలో కూర్చుంది. గిల్ బంతిని బౌండరీకి తరలించినప్పుడల్లా చప్పట్లు చరిచింది. సిక్సర్ కొడితే గంతులేసింది. సారా ఫేస్ లో ఆ సంతోషాన్ని చూసిన వారికి గిల్ తో ప్రేమాయణం నడుపుతుందని భావిస్తారు చాలా మంది. అదే శుభమన్ గిల్ నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 92 పరుగులకు అవుటయ్యాడు. అప్పుడు చూడాలి. సారాను. ఆందోళన కనిపించింది. గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడన్న ఆవేదన. గిల్ అవుటయి మైదనాన్ని వీడుతున్నప్పుడు లేచి నిలబడి మరీ స్టాండింగ్ ఓవిషేన్ ఇచ్చింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story