Mon Mar 31 2025 22:55:48 GMT+0000 (Coordinated Universal Time)
T 20 World Cup 2024 : నేడు భారత్ - ఆప్ఘనిస్థాన్ మ్యాచ్
టీ 20 వరల్డ్ కప్ లో నేడు భారత్ తన తొలి పోరుకు సిద్ధమయింది. భారత్ నేడు ఆప్ఘనిస్థాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది

టీ 20 వరల్డ్ కప్ లో నేడు భారత్ తన తొలి పోరుకు సిద్ధమయింది. భారత్ నేడు ఆప్ఘనిస్థాన్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ మ్యాచ్ లలో మూడింట గెలిచి సులువుగానే సూపర్ 8కు చేరకున్న భారత్ నేడు ఆప్ఘనిస్థాన్ తో తలపడనుంది. అంతకు ముందు న్యూయార్క్ లో ఆడిన జట్టు నేడు వెస్టిండీస్ పిచ్ లపై ఆడనుంది. బ్రిడ్జిటౌన్ వేదికగా నేడు రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పేసర్లకు అనుకూలంగా...
ఈ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బౌలర్లు రాణిస్తే ఈ మ్యాచ్ కూడా భారత్ పరం అవుతుంది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. అలాగని ఆప్ఘనిస్థాన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలేలేదు. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ పెర్ఫార్మెన్స్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Next Story