Mon Dec 23 2024 14:54:16 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ఒకవైపు విరాట్ బర్త్‌డే.. మరొకవైపు మ్యాచ్ .. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా
నేడు పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి పుట్టిన రోజు విరాట్ తన 35వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
నేడు పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి పుట్టిన రోజు. విరాట్ తన 35వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అదీ కూడా ఎక్కడో కాదు. లక్షలాది మంది అభిమానుల సమక్షంలో. ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ కు వెరీ వెరీ స్పెషల్ డే. ఒకవైపు విరాట్ కోహ్లి పుట్టిన రోజు వేడుకలను కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఘనంగా జరిపాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు సౌతాఫ్రికాతో మ్యాచ్ జరుగుతుండటంతో స్టేడియానికి వచ్చే అభిమానులకు ప్రత్యేకంగా కోహ్లి ఫొటో ఉన్న మాస్క్‌లను పంపిణీ చేయనున్నారు. దీంతో స్టేడియం అంతా కోహ్లీయే కనిపించడనున్నాడు.
పుట్టిన రోజు వేడుకలను...
35వ రోజవ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని క్రికెట్ అసోసియేషన్ భారీ కేక్ ను కూడా సిద్ధం చేసింది. ఈ కేక్ ను అభిమానుల సమక్షంలోనే విరాట్ కట్ చేయనున్నాడు. మామూలుగానే విరాట్ కు అభిమానుల సంఖ్య ఎక్కువ. స్టేడియం మొత్తం ఆ పేరుతో మారుమోగిపోతుంటుంది. పైగా ఈరోజు మ్యాచ్ తో పాటు బర్త్‌డే కూడా జరుగుతుండటంతో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. స్టేడియం విరాట్ కోహ్లి పేరుతో మోతెక్కిపోనుంది. అయితే ఈ మ్యాచ్ కు విరాట్ సన్నిహితులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
సెంచరీ చేయాలంటూ....
అయితే తన 35వ పుట్టిన రోజు విరాట్ కోహ్లి సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే 49వ శతకం చేసినట్లవుతుంది. అందుకే విరాట్ అభిమానులు ఎవరైనా సరే ఈరోజు సెంచరీ చేయాలనే కోరుకుంటారు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ కావడంతో మరింత కిక్కు ఉండనుంది. అందుకే ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా. ఒకవైపు మ్యాచ్. మరొక వైపు విరాట్ బర్త్‌డే. సౌతాఫ్రికాపై మ్యాచ్ గెలిచే అవకాశాలున్నాయని ఇప్పటికే అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోని అన్ని హ్యాండిల్స్ లోనూ విరాట్ బర్త్‌డే విషెస్ తో హోరెత్తిపోతుంది. విరాట్ హ్యాపీ బర్త్‌డే... ఈరోజు ఆల్ ది బెస్ట్ కూడా.
Next Story