Fri Dec 20 2024 18:08:53 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup 2024 : ఎవడ్రా మనల్ని ఆపేది.. ఫైనల్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తుందిగా
ఈరోజు టీం ఇండియా సెమీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ తో తలపడేనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది
ఈరోజు టీం ఇండియా సెమీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ తో తలపడేనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే మ్యాచ్ కు రిజర్వ్‌డే కూడా లేకపోవడంతో ఈ మ్యాచ్ లో వర్షం పడి ఆట రద్దయితే భారత్ నేరుగా ఫైనల్స్ కు చేరుకుంటుంది. అయితే ఆట జరిగితే మాత్రం మనోళ్లు సత్తా చాటాల్సిందే. అందుకు అనుగుణంగా శ్రమిస్తున్నారు భారత ఆటగాళ్లు. వరుణ దేవుడిని నమ్ముకోకుండా స్వశక్తినినమ్ముకుని పగ తీర్చుకోవడానికి టీం ఇండియా సిద్ధమయింది. 2022లో తమను సెమీ ఫైనల్స్ లో ఓడించిన ఇంగ్లండ్ ను ఇప్పుడు చిత్తుగా ఓడించి సత్తా చాటాలని టీం ఇండియా తహతహలాడుతుంది.
ఫామ్ లో ఉండటంతో...
భారత్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. విరాట్ కోహ్లి తప్పించి అందరూ ఫామ్ లోకి వచ్చారు. టీ 20 వరల్డ్ కప్ లో మనోళ్లు ప్రదర్శించిన ఆటతీరును చూసిన వారికి ఎవరికైనా ఫైనల్స్ కు సులువుగా ఇండియా చేరుకుంటుందన్న అంచనాలయితే వినిపిస్తున్నాయి. అన్ని ఫార్మాట్లలో భారత్ బలంగా ఉండటమే ఇందుకు కారణం. బ్యాటర్లు కూడా సత్తా చాటుతున్నారు. బౌలర్లు టపా టపా వికెట్లు తీస్తూ విజయంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇక ఫీల్డింగ్ విషయలోనూ ఒకింత ఆందోళన కనపడుతున్నప్పటికీ, క్యాచ్ లు మిస్ చేయకుండా ఈ మ్యాచ్ లో ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడితే ఫైనల్స్ కు వెళ్లడానికి భారత్ ను ఎవరూ ఆపలేరు.
కష్టాలుపడుతూనే...
ఇంగ్లండ్ విషయానికి వస్తే కష్టాలుపడుతోంది. సెమీ ఫైనల్స్ కు చేరడానికి ఆజట్టు ఆపసోపాలు పడింది. అయితే బ్యాటింగ్ పరంగా మంచి హిట్టర్లున్నారు. ఈ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందంటున్నారు. టాస్ గెలిచిన వాళ్లు తొలుత బ్యాటింగ్ తీసుకుంటారన్నది క్రీడా నిపుణులు అంచనా. ఇక్కడ ఐదు మ్యాచ్ జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు గెలవడమే ఇందుకు నిదర్శనం. పెద్దగా స్కోరు మాత్రం చేయలేకపోవచ్చు కానీ. తర్వాత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేసే వీలున్న పిచ్ జార్జి టౌన్ అని చెబుతున్నారు. మరి మనోళ్లను ఆపేశక్తి ఇంగ్లండ్ బౌలర్లకు ఉంటుందా? లేదా? అన్నది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది.
Next Story