Fri Dec 20 2024 03:51:22 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : నా సామిరంగా.. మ్యాచ్ అంటే ఇదే కదా బ్రో?
నేడు భారత్ - న్యూజిలాండ్‌ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్‌లో ఇది అత్యంత ఆసక్తికరమైన పోరుగా చూడాలి
రెండూ బలమైన జట్లే. ఎవరూ ఎవరికి తీసిపోరు. ఇప్పటి వరకూ వరల్డ్ కప్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లలోనూ రెండు జట్లు వరస విజయాలు సాధించాయి. మంచి ఊపు మీదున్నాయి. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి ఈరోజు ఎవరికి తొలి ఓటమి? ఎవరికి విజయాలు కంటిన్యూ అవుతుందన్నది తేలనుంది. నేడు భారత్ - న్యూజిలాండ్‌ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్‌లో ఇది అత్యంత ఆసక్తికరమైన పోరుగా చూడాలి. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. ఆదివారం కావడంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు కూడా ఇది నిజమైన దసరా పండగగా చెప్పుకోవాలి.
మనకే కొంత...
భారత్ గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో మనకే కొంత ఎడ్జ్ ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నా న్యూజిలాండ్ జట్టు బలంగా ఉండటంతో గెలుపోటములు చివర వరకూ ఎవరదనేది చెప్పడం కష్టమేనని అంటున్నారు. ధర్మశాల పిచ్ బౌలర్లకు అనకూలంగా కనిపిస్తుంది. అందుకే వడి వడిగా వికెట్లు తీస్తే భారత్ న్యూజిలాండ్ ను కట్టడి చేయవచ్చు. ఇటు పేసర్లకు, అటు స్పిన్నర్లకు కూడా అనుకూలించే పిచ్ గా క్రీడా పండితులు చెబుతున్నారు. దీంతో భారీ స్కోరు నమోదు చేసే అవకాశం మాత్రం లేదు.
హార్ధిక్ స్థానంలో...
భారత్ జట్టులో హార్ధిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను దించే ఛాన్సు ఉంది. బ్యాటింగ్ పరంగా భారత్ బలంగా కనిపిస్తుంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరూ నిలకడగా నిలబడితే చాలు స్కోరు బోర్డు పరుగులు తీసినట్లే. ఇక విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్, కే ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జడేజా వరకూ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ మ్యాచ్‌కు శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమిని దించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ప్రత్యర్థి జట్లు కూడా...
న్యూజిలాండ్‌ను కూడా అంత తేలిగ్గా తీసి పారేయలేం. అందరూ ఫుల్ ఫాంలో ఉన్నారు. కాన్వే యంగ్, రచిన్, మిచెల్ వంటి వారు అదరగొడుతున్నారు. బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ పరంగా కూడా బలంగా కనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన పండగ. మంచి షాట్లు...పదునైన బౌలింగ్‌ను ఈరోజు రెండు జట్ల నుంచి చూసే అవకాశం లభించింది. మరి చివరకు ఎవరిది విజయం అనేది చెప్పలేని పరిస్థితి అయినా.. క్రీడా స్ఫూర్తితో ఎవరు గెలిచినా పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అభిమానులుగా భారత్ గెలవాలని కోరుకుందాం.
Next Story