Fri Nov 22 2024 20:05:36 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఈ ఇద్దరినీ ఇక వచ్చే టీ20 వరల్డ్ కప్ చూడలేం.. బాధ అయినా తప్పదుగా బ్రో?
టీ20 వరల్డ్ కప్ కు విారాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు.
ిఒకరు కెప్టెన్.. మరొకరు మాజీ కెప్టెన్.. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లే. వాళ్లిద్దరూ ఉంటే ప్రత్యర్థులకు చెమటలే. వారిని అవుట్ చేస్తే చాలు ఇక గెలిచినంత సంబరపడిపోతారు అవతలి జట్టు ప్లేయర్లు. వాళ్లు కుదురుకుంటే చాలు.. ఇక సిక్సర్లు.. ఫోర్లు.. స్కోరు బోర్డు ఎక్కడకు వెళుతుందో చెప్పలేం. అలాంటి మేటి ఆటగాళ్లు ఇద్దరూ.. వాళ్లే కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి. ఇద్దరూ ఉంటే ప్రత్యర్థులకు ఎంత దడో.. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు అంత ధైర్యం. విరాట్ ఆడకపోతే.. రోహిత్ ఉన్నాడులే.. రోహిత్ అవుట్ అయితే కోహ్లి భాయ్ ఉన్నాడుగా అనే ధైర్యం మన వెన్నంటే ఉంటుంది. అలాంటి జోడీ ఇక వచ్చే టీ 20 వరల్డ్ కప్ లో కనిపించరు.
ఇద్దరికీ ఇదే ఆఖరు...
ఎందుకంటే ఇద్దరికీ ఇదే ఆఖరి టీ20 వరల్డ్ కప్. రిటైర్ మెంట్ ప్రకటించేశారు. కొన్నాళ్లుగా ఇద్దరిపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. తమ ఆటను తాము ఆడుతూ వెళ్లారు తప్పించి విమర్శకులకు పెద్దగా సమాధానం చెప్పలేదు. టీ 20 క్రికెట్ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను ఇద్దరూ లిఖించుకున్నారు. రోహిత్ శర్మ... 9 టీ 20 వరల్డ్ కప్ లు ఆడాడు. కోహ్లి ఆరు ప్రపంచ కప్ లు ఆడాడు. ఇద్దరూ చిన్న వయసులోనే క్రికెట్ లోకి అరంగేట్రం చేసి పాతుకు పోయారు. బ్యాటింగ్ లో తమకు ఎదురు లేదని నిరూపించుకున్నారు. ఇద్దరూ ఉండి వేల పరుగులు సాధించిపెట్టారు. భారత్ కు ఎన్నో విజయాలను సాధించిపెట్టారు.
వయసును చూసైనా...
ఒక శకం ముగిసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ... రన్ మెషీన్ విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక వీరి షాట్లు టీ20 లు చూడలేమో. కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే తాము తప్పుకోలేదని విరాట్ కోహ్లి గౌరవంగా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇద్దరు ఉంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ధైర్యంగా ఉండే వాళ్లో.. అందరికీ తెలుసు. కాకుంటే.. ఎప్పటికైనా రిటైర్మెంట్ అవ్వకతప్పదు. వచ్చే టీ 20 వరల్డ్ కప్ లో వీళ్లిద్దరూ కనిపించకపోయినా వారికున్న కసి.. వారిలో ఉన్న పట్టుదల... వారికి ఉన్న సామర్థ్యాన్ని వచ్చే తరానికి అందించాలని కోరుకోవడం తప్ప ఇంతకంటే మనం ఏం ఆశించగలం. వచ్చే వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మకు 39 ఏళ్లు.. కోహ్లికి 37 ఏళ్ల వయసు అవుతుంది. రాబోయే తరానికి ఛాన్స్ ఇవ్వాలంటే రిటైర్ అవ్వక తప్పదు కదా? అందుకే మనసులో బాధగా ఉన్నా.. టీ20 వరల్డ్ కప్ కు వారికి గౌరవంగా వీడ్కోలు పలుకుతూ.. సెల్యూట్ చేయాల్సిందే.
Next Story