Fri Dec 20 2024 12:24:45 GMT+0000 (Coordinated Universal Time)
T20 World Cup : ఆడిపోసుకున్న వాళ్లకు ఇచ్చిపడేశావుగా... అది కదా.. దేముడంటే...?
ఈ వరల్డ్ కప్ లో అత్యంత నిరాశగా ఆడింది ఎవరూ అంటే.. అది విరాట్ కోహ్లి అనే చెప్పాలి
ఈ వరల్డ్ కప్ లో అత్యంత నిరాశంగా ఆడింది ఎవరూ అంటే.. అది విరాట్ కోహ్లి అనే చెప్పాలి. ఎందుకంటే... టీం ఇండియా లీగ్ మ్యాచ్ లన్నీ వరసగా అన్ని మ్యాచ్ లను గెలుచుకుంటూ వచ్చింది. సూపర్ 8 లోనూ తిరుగు లేకుండా విజయాలను చూసింది. కానీ విరాట్ కోహ్లి ఓపెనర్ గా తిరిగి వెనువెంటనే పెవిలియన్ కు వెళుతుండటంతో అందరు విమర్శలకు లోనయ్యాడు. ఎంతగా అంటే విరాట్ స్థానంలో యశస్వి జైశ్వాల్ ను దించడం బెటర్ కదా? అన్న సూచనలు వినిపించాయి. కానీ టీం ఇండియా సెలెక్టర్లు ఆ తప్పు చేయలేదు. ఎందుకంటే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే విరాట్ పై ఆశలు ఉంచి ఓపెనర్ గానే కొనసాగించారు.
వరస మ్యాచ్ లలో...
నిజానికి గతంలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ధోనీ అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు. చివరికి ఫైనల్స్ లో విజృంభించి కప్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సెంటిమెంట్ కావచ్చు... కోహ్లీ మీద నమ్మకం కావచ్చు.. విరాట్ కోహ్లీని కదిలించలేదు.... దాదాపు ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లోనే 36 పరుగులు చేసి పరవాలేదనిపించిన విరాట్ కోహ్లి మిగిలిన ఐదు మ్యాచ్ లలో డకౌట్ తోనో, కేవలం పది పరుగులలోపు చేసి వెనుదిరిగాడు. దీంతో విరాట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్ లో లేడని ఆడిపోసుకున్నారు. అతడిని కొనసాగించడం ఎందుకు దండగ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. కానీ కోహ్లీ సంగతి తెలియదు.. తన సత్తా ఏంటో ఫైనల్స్ లో చూపించాడు.
ఫైనల్స్ లో మాత్రం...
గ్రూప్ దశలో మూడు మ్యాచ్ లలో ఐదు పరుగులు చేసిన కోహ్లిని ఎందుకు కొనసాగిస్తారని ప్రశ్నించిన వారు లేకపోలేదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ దానికి సమాధానమిచ్చాడు. విరాట్ పై మాకు నమ్మకం ఉందని, ఫైనల్ కోసం పరుగులను దాచుకున్నాడేమో అని అన్నాడు. రోహిత్ అన్న మాటలను నిజం చేస్తూ సౌతాఫ్రికాతో నిన్న జరిగి టీ 20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లి అంటూ లేకపోతే... మనకు ఇంతటి అద్భుతమైన విజయం లభించేది కాదు. అక్షర్ పటేల్ దూకుడుగా ఉండటంతో అతనికి ఛాన్స్ ఇస్తూ పెద్దమనసు చాటుకుంటూనే తాను కూడా అవసరమైనప్పుడు.. బంతి అంది వచ్చినప్పుడు బాదేశాడు. అంతే.. విరాట్ కోహ్లి 76 పరుగులు చేశాడు. అదే వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవడానికి దగ్గర దారి ఏర్పడింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లియే ఎంపికయ్యాడు. దటీజ్ విరాట్ కోహ్లి..
Next Story