Mon Dec 23 2024 11:30:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్యాడ్‌లక్... భారత్‌కు అదే శాపమా?
వార్మప్ మ్యాచ్‌లు ఆటగాళ్లకు ఊపునిస్తాయి. నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. అన్ని విధాలుగా మైదానంలో రాణించేందుకు ఉపయోగపడతాయి.
వార్మప్ మ్యాచ్‌లు ఆటగాళ్లకు కొంత ఊపునిస్తాయి. నూతనోత్సాహాన్ని కలిగిస్తాయి. అన్ని విధాలుగా మైదానంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. గ్రౌండ్లో రాటు దేలడానికే వార్మప్ మ్యాచ్‌లను పెడతారు. అయితే బ్యాడ్ లక్. భారత్ ఎటువంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడకుండానే వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ తలపడతుంది. ఇప్పటి వరకూ వరసగా వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ వార్మప్ మ్యాచ్‌లు లేకుండా నేరుగా మైదానంలోకి అడుగుపెడుతుండటంతో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరసగా ఆడినా...
మొన్నటి వరకూ ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన భారత్ జట్టు వరల్డ్ కప్ కు మాత్రం వార్మప్ మ్యాచ్‌లను ఆడలేకపోయింది. వార్మప్ మ్యాచ్‌లు ఆడకుండానే ముగిశాయి. వర్షం కారణంగా ఆడలేకపోయిన భారత్ జట్టు నేరుగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి వార్మప్ మ్యాచ్ ఇంగ్లండ్ తోనూ, రెండో వార్మప్ మ్యాచ్ నెదర్లాండ్స్‌తోనూ ఆడాల్సి ఉంది. కానీ వర్షం కురవడంతో మ్యాచ్‌లు రద్దయ్యాయి. దీంతో నేరుగా ఆస్ట్రేలియాతోనే తొలి మ్యాచ్ ను భారత్ ఆడనుండటం అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది.
తొలి మ్యాచ్...
రేపటి నుంచి వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్ మాత్రం ఈ నెల 8వ తేదీన తన తొలి మ్యాచ్‌ను ఆష్ట్రేలియాతో తలపడనుంది. ఇటీవల భారత్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే సిరీస్ ను టీం ఇండియా 2 - 1 తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను సునాయాసంగా గెలిచిన భారత్ మూడో మ్యాచ్‌కు మాత్రం చేతులెత్తేసింది. అదే ఆస్ట్రేలియాతో ఈ నెల 8వ తేదీన చెన్నైలో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు నేరుగా బరిలోకి దిగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తున్నా అంతకు ముందు ఆస్ట్రేలియా జట్టుతో ఆడి ఉన్న కారణంగా పరవాలేదంటున్నారు క్రీడా నిపుణులు. మొత్తం మీద వార్మప్ మ్యాచ్‌లు లేకుండానే మనోళ్లు నేరుగా మైదానంలోకి దిగుతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం వార్మప్ మ్యాచ్‌లు ఆడారు. మరి మనోళ్లు ఎలా మైదానంలో మెలుగుతారన్నది టెన్షన్ గా మారింది.
Next Story