Fri Dec 20 2024 07:14:34 GMT+0000 (Coordinated Universal Time)
World Cup : ముందుంది అసలు యవ్వారం.. అప్పుడు ఇలాగయితే ఎలా?
ఓడిపోతారనుకున్న మ్యాచ్ లో విజయం సాధించాం. అయితే భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో మన వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి
ఓడిపోతారనుకున్న మ్యాచ్ లో విజయం సాధించాం. అది మన గొప్ప తనమా? ప్రత్యర్థుల బలహీనతా? అంటే చెప్పలేం కానీ మొత్తం మీద టీం ఇండియాకు ఈ వరల్డ్ కప్ లో సుడి ఉందని మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. భారత్ కు ఈ వరల్డ్ కప్ లో వరసగా ఆరో విజయం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. అంతా బాగానే ఉంది. అయితే బ్యాటింగ్ వైఫల్యాన్ని మరువ కూడదని కొందరు విశ్లేషిస్తున్నారు. వరసగా అందరూ అవుట్ కావడంతో అతి తక్కువ పరుగులు చేయడం వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇదే తొలిసారి. భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో ఇండియన్ బ్యాటర్లు తమ తప్పులను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.
తక్కువ స్కోరుతో...
రోహిత్ శర్మ ఎప్పటిలాగానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఆ మాత్రం స్కోరు అయినా రాగలిగింది. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కొహ్లి పెద్దగా పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో స్కోరు మందగించింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాగా రాణించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులు చేశాడు. మొత్తం మీద టీం ఇండియా 220 పరుగులు చేయడం అంటే వరల్డ్ కప్ లో అతి తక్కువ స్కోరు నమోదు చేయడమే కారణమని చెప్పకతప్పదు. ఇలా ఫామ్ లో ఉన్న బ్యాటర్లు బలహీనంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు మీద ఇలా ఆడితే రేపు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఎలా చేరుకుంటారన్న ప్రశ్న సహజంగానే ప్రతి క్రికెట్ అభిమానికి కలుగుతుంది.
బౌలర్ల పుణ్యమా అని..
అయితే ఇంగ్లండ్ వీక్ గా ఉండటంతో మనం బతికిపోయేమనే వాళ్లు ఎక్కువ. బౌలర్ల కారణంగా కూడా ఇంగ్లండ్ పై విజయం సాధించామనే వారు కూడా కొందరున్నారు. మొత్తం మీద చివరకు వంద పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. వినటానికి.. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా ముందు ముందు మనోళ్లు ఎలా ఆడతారన్న టెన్షన్ నెలకొంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు, బుమ్రాకు రెండు, కుల్దీప్ యాదవ్ కు రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్లు తీయడంతో మనం తేలిగ్గానే బయటపడ్డాం. రానున్న మ్యాచ్ లలోనైనా టీం ఇండియా ఆటగాళ్లు మంచి పెర్ ఫార్మెన్స్ చేయాలని ఆశిద్దాం.
Next Story