Mon Dec 23 2024 11:36:57 GMT+0000 (Coordinated Universal Time)
నెదర్లాండ్ జట్టులో మన బెజవాడ కుర్రోడు
వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. పది దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. పది దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. బంతి బంతికి టెన్షన్ మొదలయ్యే ఘడియలు ఎంతో దూరం లేవు. వరల్డ్ కప్ కోసం వేయి కళ్లతో కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఇటు పగలు, అటు రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో తళుక్కుమనే డ్రెస్లతో పది టీంలు అలరించనున్నాయి. మైదానంలో ఎవరి రోజు అనేది ముందు అంచనా వేయలేని పరిస్థితి. ఆ క్షణం లక్ ప్రకారమే వికెట్లు పడినా.. సిక్సర్లు కొట్టినా అంతే. ఆ ఆటగాళ్లు చెలరేగిపోతారు. బౌలర్లు బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తారు.
ఇండియాలో క్రికెట్ అంటే
పది దేశాలకు చెందిన క్రికెటర్లు పది రకాలుగా మనకు కనిపిస్తారు. కానీ ఇండియాలో క్రికెట్కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు లేదు. రోజుకొక ఆటగాడు ఇండియాలో మెరుస్తున్నారు. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు ఇక్కడ మనీ తయారు చేసే మిషన్. అత్యంత వేగంగా ధనవంతులయ్యే ఏకైక ఆట క్రికెట్ అని అందరూ అదే బాట పట్టారు. ఇండియాలో అండర్ 19 కు సెలెక్ట్ అయితే చాలు ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. ఐపీఎల్లో అవకాశాలు వస్తాయి. తర్వాత టీం ఇండియాలో చోటు దక్కిందంటే పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.
కీలక ఆటగాడిగా...
అయితే విదేశీ జట్టులోనూ మన ఆటగాళ్లు మెరుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతునన వరల్డ్ కప్ లో బెజవాడ కుర్రోడు విదేశీ జట్టులో కీలకంగా ఉన్నారు. నెదర్లాండ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న నిడమానూరు అనిల్ తేజ బెజవాడ కుర్రోడే. తొలుత న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ తరుపున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన తేజ అనంతరం నెదర్లాండ్స్ కు వెళ్లి అక్కడ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తెలుగుతేజం తేజ కేవలం యాభై ఒక్క బంతుల్లోనే 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నెదర్లాండ్స్ జట్టు చిన్నది కావచ్చు. కానీ వరల్డ్ కప్ కు ఎంపికై సంచనాలు సృష్టించింది. ఇప్పుడందరీ దృష్టి నెదర్లాండ్స్ జట్టులో ఉన్న మన బెజవాడ కుర్రోడిపైనే ఉంది.
Next Story