India 2024 : ఈ ఏడాది ఇండియాలో క్రికెట్ తర్వాత ప్రొకబడ్డీకే ఆదరణ ఉందా?

కొద్ది రోజులుగా ఇండియాలో ప్రొ కబడ్డీకి కూడా కొంత ఆదరణ లభిస్తుంది

Update: 2024-12-20 12:37 GMT

భారత్ లో క్రికెట్ కు మించిన ఆటలేదు. యువకులంతా క్రికెట్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో పాటు అవకాశాలు కూడా అదే రేంజ్ లో కళ్ల ముందు కనపడుతుండటంతో క్రికెట్ పట్ల యువత ఆకర్షితువుతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ ప్రారంభమయిన తర్వాత ఆటగాళ్లకు కొదవ లేకుండా పోయింది. ఎందరో యువ ఆటగాళ్లు గ్రామీణ ప్రాంతాల నుంచివచ్చిఎంపికయి తర్వాత టీం ఇండియాలోనూ చోటు సంపాదించుకున్నారంటే అది ఐపీఎల్ పుణ్యమేనని ఎవరైనా ఇట్టే చెబుతారు. పేరుకు పేరు .. డబ్బులకు డబ్బులు వచ్చిపడుతుండటంతో క్రికెట్ కు ఇండియాలో ఆదరణ ఏమాత్రం తగ్గదన్నది కూడా అంతే వాస్తవం.

గత కొద్ది రోజులుగా...
అయితే గత కొద్ది రోజులుగా ఇండియాలో ప్రొ కబడ్డీకి కూడా కొంత ఆదరణ లభిస్తుంది. రానురాను ఈ ఆటకు కూడా ఫ్యాన్స్ క్రమంగా పెరుగుతున్నారు. క్రికెట్ తరహాలో టీవీ మాధ్యమాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారు. భారత్ లో బ్యాడ్మింటన్, చెస్, టెన్సిస్ వంటి ఆటలకు కూడా ప్రాధాన్యత లభిస్తున్నప్పటికీ క్రికెట్ తర్వాత అత్యంత ఆదరణ పొందింది ప్రొ కబడ్డీ అని చెప్పక తప్పదు. సెలబ్రిటీలు కోట్లు వెచ్చించి టీం లను కొనుగోలు చేయడం వల్ల దీనికి మరింత క్రేజ్ ఏర్పడింది. కబడ్డీ ఆటగాళ్లకు కూడా ఒకింత ఫ్యాన్స్ పెరుగుతున్నారు. అదే సమయంలో వారి ఆదాయం కూడా పెరుగుతుంది. క్రమంగా కబడ్డీకి భారత్ లో మరింత ఆదరణ పెరుగుతుందన్నఅంచనాలు వినిపిస్తున్నాయి.
అత్యంత ఆదరణ పొందుతూ...
2024లో కూడా కబడ్డీకి అత్యంత ఆదరణ లభించిందనే చెప్పాలి. ప్రతి ఏడాది ప్రొకబడ్డీ లీగ్ లు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడటంతో పాటు టీమ్ లు గా విడిపోయి మైదానంలో దిగిన తర్వాత చూపించే ఆటతీరుతో ఫిదా అవుతున్నారు. అత్యంత విజయవంతమైన ఆటల్లో ప్రొకబడ్డీ ఒకటిగా మారింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతానికే పరిమితమయిన కబడ్డీ నేడు విశ్వవ్యాప్తం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారతదేశంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్టింగ్ లీగ్‌లో ఒకటిగా మారింది. ఇక్కడ కూడా అనేక జట్లుపోటీ పడుతుండటంతో పాటు వ్యూయర్ షిప్ తో పాటు స్టేడియంలోకివెళ్లి చూసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. టైటిల్ పోరు కోసం జరుగుతున్న ఈ పోటీలు మంచి ఆదరణనే పొందుతున్నాయి. 2024లో మంచి ఆదాయం తెచ్చి పెట్టిన ఆటగా క్రికెట్ తర్వాత ప్రొకబడ్డీ చోటు సంపాదించకుంది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 

Tags:    

Similar News