Andhra Pradesh Budget : వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు రాష్ట్రంతో పాటు దేశానికి దోహదపడేది వ్యవసాయరంగమేనని తెలిపారు. వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం ప్రాధమికంగా గుర్తించిందని తెలిపారు. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని...
2047 సర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తామన్న అచ్చెన్నాయుడు 20247 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ను మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఏడాది రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు పర్చనున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలైన పశు, మత్య్య పరిశ్రమల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందచేస్తామని చెప్పారు. తుపానులు, ప్రకృతి విపత్తుల సమయంలో చేపల వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.