ఏపీ బడ్జెట్.. నవరత్నాలకే లక్ష కోట్లు
ఏపీప్రభుత్వం నేడు బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో నవరత్నాలకు అధిక ప్రాధన్యాత ఇవ్వనున్నారని తెలిసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ లో నవరత్నాలకు అధిక ప్రాధన్యాత ఇవ్వనున్నారని తెలిసింది. నవరత్నాల అమలుకు దాదాపు లక్ష కోట్ల కేటాయింపు జరిపారని సమాచారం. రాబడులను పెంచి అంచనాలను చూపించనున్నారు. మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి తొలిసారి బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు.
వివిధ పథకాల కింద....
ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు కోట్ల చొప్పున బడ్జెట్ లో 350 కోట్లు కేటాయించనున్నారు. వ్యవసాయరంగానికి 31 వేల కోట్ల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం 10 వేల కోట్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి 4,500 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు 6,400 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకానికి 4,200 కోట్లు, అమ్మఒడి పథకానికి 6,500 కోట్లు, జగనన్న విద్యాదీవెన పథకానికి 2,400 కోట్లు సున్నా వడ్డీ పథకానికి 800 కోట్లు, కాపు నేస్తం పథకానికి 500 కోట్లు కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది.