మండలిలో బడ్జెట్ ను మంత్రి అప్పలరాజు

ఈసారి శాసనమండలిలో బడ్జెట్ ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టబోతున్నారు

Update: 2022-03-11 01:52 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ 2.50 లక్షల కోట్లకు పైగానే ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే ఈసారి శాసనమండలిలో బడ్జెట్ ను పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ తనకు ఇచ్చారని అప్పలరాజు తెలిపారు.

అరుదైన అవకాశం.....
శాసనసభలో ఎప్పటిలాగానే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అదే సమయంలో శాసనమండలిలో మాత్రం మంత్రి అప్పలరాజు ప్రవేశపెడతారు. బలహీన వర్గాల వారికి చెందిన అరుదైన అవకాశమని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News