chandrababu : చంద్రబాబు నేడు కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఎస్.ఐ.పీ.బీ సమావేశం జరగనుంది.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయానికి రానున్న చంద్రబాబు పలు శాఖలపై సమీక్షలు చేయనున్నారు.
పవన్ తో పాటు...
ఎస్.ఐ.పీ.బీ సమావేశం లో పరిశ్రమలు, ఆర్థిక, టూరిజం, వ్యవసాయ శాఖ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్థలకు ఈ సమావేశంలో చర్చించి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. ఏపీలో పెట్టుబడులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.