ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిన లోకేష్

దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది;

Update: 2025-01-30 08:04 GMT
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిన లోకేష్
  • whatsapp icon

దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మన మిత్ర పేరుతో ఈ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. వాట్సాప్ నెంబరు 95523 00009 కు మెసేజ్ చేస్తే సేవలను పొందవచ్చు. తొలి విడతగా 161సేవలను అందించనున్నారు. పౌరులకు అవసరమైన అన్ని సేవలను వాట్సప్ ద్వారా సేవలను పొందవచ్చు.

161 సేవలను...
ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉందని తెలిపారు. కేవలం పౌరసేవలతో పాటు అవసరమైన సమాచారాన్ని కూడా ఈ సేవలను పొందే అవకాశముంటుంది. తొలి విడతలలో ఏపీఎస్ ఆర్టీసీ, దేవాదాయ, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. భవిష్యత్ లో ఈ సేవలను ఐదు వందల వరకూ విస్తరిస్తామని మత్రి లోకేష్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువగా తీసుకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.


Tags:    

Similar News