కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కిందపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో సీఎం కప్ టోర్నీని సీతారాం

Update: 2021-12-23 10:22 GMT

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కిందపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో సీఎం కప్ టోర్నీని సీతారాం ప్రారంభించారు. అక్కడున్న ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు ఆయన కూడా కబడ్డీ ఆడేందుకు సిద్ధమయ్యారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ బరిలోకి దిగారు. ముగ్గురిని అవుట్ చేశారు. నాలుగో వ్యక్తిని అవుట్ చేసేందుకు వెళ్లగా.. స్పీకర్ తమ్మినేని కాలు జారి కింద పడిపోయారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ఆటగాళ్లు.. సీతారాం ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆటల్లో ఇలాంటివన్నీ సహజమేనంటూ.. మళ్లీ ఆటలో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని. కాగా.. ఆమదాలవలస జూనియర్‌ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్థాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ కాలేజీల నుంచి కబడ్డీ, క్రికెట్ ప్లేయర్లు తరలివచ్చారు.



Tags:    

Similar News