చంద్రబాబు సన్నిహితుడి ఇంట్లో సీఐడీ సోదాలు

టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీసీఐడీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు;

Update: 2021-12-10 06:02 GMT
lakhmi naryana, ap cid, chandrababu, searches, heritage
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష్మీనారాయణ ఐఏఎస్ లలో కీలకంగా ఉండేవారు. పదవీ విరమణ చేసిన తర్వాత లక్ష్మీనారాయణను హెరిటేజ్ కు ఎండీగా చంద్రబాబు నియమించుకున్నారు.

అవకతవకలు జరిగాయని...
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో లక్ష్మీనారాయణ స్కిల్ డెవలెప్ మెంబట్ సంస్థ లో పనిచేశారు. ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News