రాజమండ్రి జైలుకు గోరంట్ల మాధవ్
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను రాజమండ్రి జైలుకు తరలించారు.;

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను రాజమండ్రి జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఆయనతో పాటు మిగిలిన నిందితులను రాజమండ్రికి తరలించారు. గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురికి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు పోలీసులు తరలించారు. పోలీసు అదుపులో ఉన్న నిందితుడు చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నించారని, పోలీసు విధులను అడ్డుకున్నారన్న దానిపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసు విధులను...
దీంతో తమ విధులను అడ్డుకున్న గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వైఎస్ భారతిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయిన నిందితుడు చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలసి అడ్డుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడం, కోర్టులో హాజరు పర్చడంతో రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు వారిని తరలించారు.