Srisailam : నేటి నుంచి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి;

Update: 2025-01-11 04:06 GMT

శ్రీశైలంలో నేటి నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం నేటి ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేక పూజలు ఉంటాయి.

రద్దీ ఎక్కువగా ఉండటంతో...
ఈరోజు నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశస్థాపన, వేదపారాయణాలుతో పాటు ప్రత్యేక పూజాధికాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.


Tags:    

Similar News