Weather Report : ఆంధ్రప్రదేశ్ కు ఎల్లో అలెర్ట్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.;

Update: 2024-09-07 05:02 GMT
heavy rains, metrological department, three days,  andhra pradesh, rains in AP, Ap wather news today

 weather updates in AP

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఉత్తరం వైపు వెళ్తోందని తెలిపింది. ఇది క్రమంగా బలపడుతూ.. సోమవారం నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం ఉత్తరం దిశగా కదులుతోందని చెప్పింది. దీంతో ఏపీలో కుండపోత వర్షాల ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు వివరించారు.

అల్పపీడనం ప్రభావంతో...
అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని.. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కింది. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. 40 కి.లో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.మరోవైపు తెలంగాణకి భారీగా వర్ష సూచన కనిపిస్తోంది. రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం వేళ ఉత్తర, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


Tags:    

Similar News