నేడు ఏపీ సీఐడీ ఎదుటకు లక్ష్మీనారాయణ

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నేడు ఏపీ సీఐడీ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.;

Update: 2021-12-13 03:41 GMT
lakshmi narayana, high court, bail, skil development, andhra pradesh
  • whatsapp icon

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నేడు ఏపీ సీఐడీ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. ఏపీ స్కిల్ డెవెలెప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందటూ ఇటీవల లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేశారు.

26 మందిపై.....
ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్ చేసిన పోలీసులు నేడు లక్ష్మీనారాయణను విచారించాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా? లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? అన్నది కాసేపట్లో తేలనుంది.


Tags:    

Similar News