జలదిగ్భంధనంలో లంక గ్రామాలు

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 13.75 అడుగులకు నీటిమట్టం చేరింది

Update: 2022-07-12 06:00 GMT

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 13.75 అడుగులకు నీటిమట్టం చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొన్ని లంక గ్రామాల్లో వరద నీరు ప్రవేశించింది. కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవిపట్నం మండలం జలదిగ్భంధనం లో చిక్కుకుందని అధికారులు చెబుతున్నారు.

రెండో ప్రమాద హెచ్చరిక...
ధవళేశ్వరం బ్యారేజీకి 17. 5 అడుగులకు నీటిమట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 175 గేట్లను ఎత్తి వేసి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కోనసీమలో కొన్ని పంటలు వరదనీటిలో మునిగిపోయాయి. అధికారులు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ప్రజలను ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తున్నారు.


Tags:    

Similar News