Revanth Reddy : నేడు రెండు జిల్లాలకు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు;

Update: 2024-04-23 02:46 GMT
Revanth Reddy : నేడు రెండు జిల్లాలకు రేవంత్
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే మొదలుపెట్టారు. అభ్యర్థుల నామినేషన్ పత్తాలు సమర్పించే కార్యక్రమానికి స్వయంగా హాజరవుతూ పార్టీ క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు.

నాగర్‌కర్నూలు, కొడంగల్....
ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలులో పర్యటిస్తారు. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నేతలు, కార్యకర్తలతో కూడా సమావేశమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News