Ugadi : ఉగాది అంటే ఏంటి.. ఏ రోజు జరుపుకుంటారు?

తెలుగు సంవత్సరాదిని ఉగాది అంటారు. ఈ పండగతోనే పండగలు ప్రారంభం అవుతాయి.

Update: 2024-04-07 12:10 GMT

తెలుగు సంవత్సరాదిని ఉగాది అంటారు. ఈ పండగతోనే పండగలు ప్రారంభం అవుతాయి. తెలుగు సంవత్సరం కూడా మొదలవుతుంది. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలోనూ ఈ ఉగాది వేడుకలను జరుపుకుంటారు. తొలి పండగ కావడంతో ఉత్సాహంగా అందరూ ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంట్లోనే పూజలు చేసుకుని ఉగాది పచ్చడి చేసుకుని తినడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది పచ్చడి చేదు, తీపి కలయికలతో ఉంటుంది. మామిడి ముక్కలు, అల్లం ముక్కలు వేసి చేస్తారు.

తెలుగు మాసాల్లో...
ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకూ నెలలు మొదలయినట్లే ఉగాది నాడు నుంచి చైత్రం నుంచి ఫాల్గుణం వరకూ జరుపుకుంటారు. మొత్తం పన్నెండు నెలలు తెలుగు మాసాలుగా వ్యవహరిస్తారు. కొన్ని సార్లు అధిక మాసాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఉగాదిని తొలి పండగగా అందరూ వేడుకగా జరుపుకుంటూ తమ ఇంటి సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు. చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
ఉగాది పచ్చడిని...
ఉగాది అంటే సంస్కృతంలో ఇలా వ్యవహరిస్తారు. ఉగ అంటే నక్షత్ర గమనం అని అంటారు. దీనికి జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. ఆది అంటే మొదలు. నక్షత్రగమనం, జన్మ, ఆయష్షు మొదలుగా పూర్వీకులు చెబుతారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడై భాసిల్లింది కూడా ఈ ఉగాది నాడే అని అంటారు. దీంతో పాటు ఉగాది నాటికి చెట్లకు కొత్త చిగుళ్లు వస్తాయి. వేపపూతతో ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. ఇందులో మామిడి ముక్కలు కలపి చేదు, తీపి, ఒగరు అంటూ.. మన జీవితంలో అన్ని కలసి ఉండేలా తయారు చేసుకుంటారు. ఈరోజు మంచి పనులు చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుందని భావిస్తారు.


Tags:    

Similar News