Ugadi : విశ్వాసునామ సంవత్సరం ఎలా ఉంటుందంటే?

నేడు ఉగాది పండగ. దేశమంతా భారతీయులు ఉగాది పండగను జరుపుకుంటారు;

Update: 2025-03-30 01:52 GMT
ugadi, festival, celebrating, india
  • whatsapp icon

నేడు ఉగాది పండగ. దేశమంతా భారతీయులు ఉగాది పండగను జరుపుకుంటారు. ఈసారి ఉగాది వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గా పిలుస్తున్నారు. ఉగాది పండగ అంటే ప్రజలకు తొలి పండగ లాంటిది. ఇప్పటి నుంచి ఇక పండగలు ప్రారంభమవుతాయి. అందుకే యుగానికి సంబంధించి ఆది అని అంటారు. అందుకే ఉగాదిగా ప్రతీతి. ప్రతి ఉగాది నాడు పంచాగ శ్రవణం జరగడం సంప్రదాయంగా వస్తుంది. వివిధ రాశుల వారికి ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతాయో అందులో చెబుతారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాగాన్ని పండితులు విడుదల చేయడంతో వారి అదృష్టాలు తెలుసుకునే వీలుంది. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎలా ఉండబోతుందో చెబుతుండటంతో అందుకు తగిన నష్ట పరిహారకాలు ఏవైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అనేక రాశుల వారికి ఈ సందర్భంగా ఈ ఏడాదిలో జరిగే అదృష్టాలతో పాటు కలిగే నష్టాలను కూడా వివరించనున్నారు.

ఖర్చు.. నష్టం?
ఆదాయ వ్యయాలను కూడా పంచాంగంలో చెప్పడం కూడా సంప్రదాయంగా వస్తుంది. ఈ ఏడాది సంపాదన ఎంత? ఖర్చు ఎంత అనేది కూడా వివరిస్తారు. కొత్త ఏడాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శుభముహూర్తాలతో పాటు మూఢమి, చెడు రోజులు వంటివి కూడా చెబుతారు. దీని ప్రకారం హిందు ప్రజలు నడుచుకోవాల్సి ఉంటుందని పండితులు సూచిస్తారు. దీని ప్రకారం పండితులు కూడా ముహూర్తాలను నిర్ణయిస్తారు. వరుడు, వధువు జాతకాలను బట్టి ముహూర్తాలను ఖరరు చేస్తారరు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు ముగిసిపోతాయన్నది కూడా పంచాగంంలో సవివరంగా వివరించనున్నారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం నిర్వహించడం అనేది అన్ని రాజకీయ పార్టీల కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంది.
ఉగాది అంటే ?
ఏ రోజు జరుపుకుంటారు? పంచాగ శ్రవణం...శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆనందంతో ఉంటారు. శాంతి కూడా ఉంటుంది.ఈ ఏడాది సంపద కూడా సమృద్ధిగానే ఉంటుంది. ఉగాది పండగ రేవంతి నక్షత్రంలో ప్రారంభమవుతుండటంతో దీని వల్ల కలిగే ఫలితాలు మార్గశిర మాసంలో కనపడతాయి. పచ్చడి తోనే దినచర్యను ప్రారంభించేలా ప్రతి కుటుంబంలో సభ్యులు ఈ ఉగాది పండగను జరుపుకుంటారు. ఉగాది రోజున సంతోషంగా ఉంటే ఏడాది మొత్తం సంతోషంగానే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉగాది రోజు ఆనందంగా ఉండండి. ఏడాదంతా సంతోషంగా గడపండి.


Tags:    

Similar News