వర్రా రవీంద్రారెడ్డికి జ్యుడీషియల్ కస్టడీ

తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, తన కేసులో కడప

Update: 2024-11-13 02:15 GMT

varra ravindra reddy

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని కడప కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. తెలంగాణ సరిహద్దులోని మార్కాపురం సమీపంలో రవీంద్రారెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతడికి న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించింది.

తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, తన కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని రవీంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ ప్రోద్బలంతోనే షర్మిల, సునీతలపై పోస్టులు చేశానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో టార్చర్ చేశారని రవీంద్రా రెడ్డి తెలిపారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. వైద్య చికిత్స నిమిత్తం రవీంద్రారెడ్డిని కడప రిమ్స్‌కు తరలించి ఆ తర్వాత కడప జిల్లా జైలుకు తరలించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేసి రవీంద్రారెడ్డి సన్నిహితులు ఇద్దరిని విడుదల చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.


Tags:    

Similar News