ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. మ్యాచ్ ని టీవీలో, ఆన్‌లైన్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు..!
ఆదివారం జరగనున్న ఆసియా కప్-2022 మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది.
ఆదివారం జరగనున్న ఆసియా కప్-2022 మ్యాచ్‌పై అందరి దృష్టి ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న భారత్, బాబర్ ఆజం కెప్టెన్ గా ఉన్న పాకిస్థాన్ తో తలపడనుంది. గత సంవత్సరం T20 ప్రపంచ కప్- 2021 సందర్భంగా దుబాయ్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు భారత్ పై 10 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. ఆసియా కప్‌లో మాత్రం పాక్ పై భారత్‌దే పైచేయి. 2018లో, మెన్ ఇన్ బ్లూ పాక్ పై రెండు సార్లు గెలిచింది. పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లలో భారత్ పై మూడు వికెట్లు మాత్రమే తీయగలిగింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 నుండి ఆసియా కప్‌లో ఆడలేదు. రాబోయే మ్యాచ్ అతని ఫామ్ కి చాలా కీలకం. 2012లో కోహ్లీ అజేయంగా 78 పరుగులతో టాప్ స్కోర్ సాధించాడు. టీ20ల్లో పాకిస్థాన్‌పై కోహ్లి సగటు 75కి మించి ఉన్నాడు. నిజాకత్ ఖాన్ సారథ్యంలోని హాంకాంగ్‌తో పాటు భారత్, పాకిస్థాన్ లు గ్రూప్ ఎలో ఉన్నాయి.