ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ ఏ బ్యాట్ ను ఉపయోగించబోతున్నాడో తెలుసా..?
ప్రస్తుతం కోహ్లి తన కెరీర్‌లో పేలవమైన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. మంచి షాట్స్ ఆడుతూ ఉన్నా బ్యాటింగ్‌లో
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేక సతమతమవుతూ ఉన్నాడు. అతడు ఎప్పుడు తిరిగి ఫామ్ లోకి వస్తాడా అని అభిమానులంతా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆసియా కప్ అతి త్వరలోనే మొదలు కాబోతోంది. ఇక్కడ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలని అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆసియా కప్ కు కోహ్లీ ప్రత్యేకమైన బ్యాట్ ను ఉపయోగించనున్నాడు.
ఆగస్ట్ 27 (శనివారం) నుండి సెప్టెంబర్ 11 మధ్య జరగనున్న ఆసియా కప్ కోసం కోహ్లీ ప్రత్యేకమైన బ్యాట్ ను వినియోగించనున్నాడు. MRF ప్రత్యేక గోల్డ్ విజార్డ్ క్వాలిటీ బ్యాట్‌ను స్పాన్సర్ చేస్తోంది. బ్యాట్ ఇంగ్లీష్ విల్లో వుడ్ తో తయారు చేయబడింది. దీని ధర కనీసం INR 22,000 ఉంటుంది.
ప్రస్తుతం కోహ్లి తన కెరీర్‌లో పేలవమైన క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. మంచి షాట్స్ ఆడుతూ ఉన్నా బ్యాటింగ్‌లో అదృష్టం కలిసి రావడం లేదు. అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా పరిగణించబడుతున్న భారత మాజీ కెప్టెన్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఈ సంవత్సరం బ్యాట్‌తో ఫార్మాట్‌లలో కేవలం 25 సగటును కలిగి ఉన్నాడు. ఇది ఏ క్యాలెండర్ సంవత్సరంలోనైనా అతని కెరీర్‌లో చెత్త దశ అని చెప్పుకోవచ్చు. 2008 లో 31.80 సగటు తో ఆడాడు. అది కూడా కెరీర్ ప్రారంభ దశ ఇది.
విరాట్ కోహ్లీకి వరుసగా రెస్ట్ ఇస్తూ ఉండడం కూడా మైనస్ గా మారుతోందని అంటున్నారు. గత నెలలో ఇంగ్లండ్‌లో జరిగిన భారత పర్యటనలో చివరిసారిగా ఆడాడు. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరిగే ఆసియా కప్ 2022లో మళ్లీ మైదానంలోకి రానున్నాడు. ఇక్కడ కూడా విఫలమయితే విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్ నుండి తప్పించాలనే డిమాండ్ భారీగా పెరగనుంది.