అడ్వాంటేజ్ పాకిస్థాన్ కే ఉందంటున్న సర్ఫరాజ్

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, వచ్చే వారం దుబాయ్‌లో తమ జట్టు భారత్‌పై విజయం సాధిస్తుందని భావిస్తున్నాడు.

Update: 2022-08-19 10:42 GMT

ఆగష్టు 28న, పురుషుల ఆసియా కప్ 2022 మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. టి20 ప్రపంచకప్‌లో రెండు జట్లు చివరిసారిగా తలపడినప్పుడు పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ జట్టును ఓడించింది. అప్పటి నుండి భారత జట్టులో చాలా మార్పులు వచ్చాయి. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ నుండి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సంవత్సరం భారతదేశం బౌలింగ్ యూనిట్ లో మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాల కారణంగా భారత్ పటిష్టంగా కనిపిస్తూ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో భారతదేశం మంచి విజయాలను అందుకుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లను ఓడించి, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 2-2తో డ్రా చేసుకుంది (నిర్ణయాత్మక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది).

ఇక పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, వచ్చే వారం దుబాయ్‌లో తమ జట్టు భారత్‌పై విజయం సాధిస్తుందని భావిస్తున్నాడు. సర్ఫరాజ్ అభిప్రాయం ప్రకారం, భారతదేశం బలమైన ప్రదర్శన చేసినప్పటికీ.. పాకిస్థాన్ జట్టుకు UAEలో పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. "ఏదైనా టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ టీమ్ జర్నీని నిర్ణయిస్తుంది. మా తొలి మ్యాచ్‌ భారత్‌తో. ఖచ్చితంగా మా జట్టులో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చివరిసారి ఆడినప్పుడు పాకిస్థాన్ అదే వేదికపై భారత్‌ను ఓడించింది. పాకిస్థాన్ కు అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు.. ఎందుకంటే మేము ఇక్కడ PSL, అనేక హోమ్ సిరీస్‌లు కూడా ఆడాము. భారతదేశం ఇక్కడ ఐపిఎల్‌లో ఆడింది, కానీ ఈ పరిస్థితుల్లో ఆడిన అనుభవం వారికి లేదు, "అని సర్ఫరాజ్ అన్నాడు. "పాకిస్థాన్‌ జట్టులో షాహీన్ షా ఆఫ్రిది ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. ప్రస్తుత జట్టును పరిశీలిస్తే, వారు మంచి క్రికెట్ ఆడుతున్నారు. కానీ మా జట్టు, ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో బాగా ఆడుతోంది, "అని అతను చెప్పాడు. 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా ఉన్నాడు.



Tags:    

Similar News