ఆ ముగ్గురూ భారత్ కు షాకివ్వగలరు: పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్

గత కొన్ని సంవత్సరాల నుండి, ఈ ముగ్గురు పాకిస్తాన్ జట్టు ప్రణాళికలు, డిమాండ్లను బాగా అమలు చేస్తున్నారు

Update: 2022-08-27 04:03 GMT

ఆసియా కప్ 2022లో భాగంగా ఆగస్టు 28, ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ ను ఫేవరెట్ గా పరిగణిస్తూ ఉన్నారు. అయితే పాకిస్థాన్ జట్టును తక్కువ అంచనా వేసే అవకాశం లేదని అంటున్నారు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ హస్నైన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా భారత్‌ ను నిలువరించగలరని మాజీ ఆఫ్ స్పిన్నర్, పాకిస్థాన్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ అభిప్రాయపడ్డారు. రెండు జట్లు అక్టోబర్ 2021 తర్వాత మొదటిసారిగా తలపడుతున్నాయి. భారత్-పాక్ జట్లు చివరిసారిగా T20 ప్రపంచ కప్-2021లో తలపడిన సంగతి తెలిసిందే..! ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా 2022 ఆసియా కప్ నుండి వైదొలిగాడు. అతడు లేకున్నా పాక్ బౌలింగ్ లైనప్ బలంగా ఉందని అంటున్నారు. హస్నైన్, నసీమ్, రవూఫ్‌ల పేస్ త్రయం ఆటను మార్చగలరని ముస్తాక్ అభిప్రాయపడ్డారు.

"గత కొన్ని సంవత్సరాల నుండి, ఈ ముగ్గురు పాకిస్తాన్ జట్టు ప్రణాళికలు, డిమాండ్లను బాగా అమలు చేస్తున్నారు" అని ముస్తాక్ విలేకరుల సమావేశంలో అన్నారు. "కెప్టెన్, ప్రధాన కోచ్‌ అయిన నాకు, మొత్తం సహాయక సిబ్బందికి ఈ ఆటగాళ్ల సామర్థ్యాలపై నమ్మకం ఉంది. షాహీన్ పేస్ అటాక్ కు నాయకత్వం వహించేవాడు, అయితే ఈ ముగ్గురు తమదైన రోజున మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలరు. భారత్ ఆటగాళ్లకు వీరిని ఎదుర్కోవడం కష్టమవ్వచ్చు." అని చెప్పుకొచ్చారు ముస్తాక్.


Tags:    

Similar News