ఆసియా కప్ టికెట్ రేట్లు ఇవే..!

రెండవ బ్యాచ్ టిక్కెట్లు బుధవారం ఉదయం ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. అభిమానులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

Update: 2022-08-18 14:14 GMT

ఆసియా కప్ 15వ ఎడిషన్‌తో తిరిగి వచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఆగస్టు 27వ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ టిక్కెట్లు ఆగస్టు 15వ తేదీ సోమవారం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. టిక్కెట్లు ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ కొనుగోలు విధానంలో విక్రయించబడతాయి. ఇక ఆగస్టు 28వ తేదీన చిరకాల ప్రత్యర్థి భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. అభిమానులు ప్రత్యేకంగా platinumlist.net వెబ్‌సైట్‌లో మ్యాచ్ ల టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

టిక్కెట్ ధరలు AED75 (INR 1620) నుండి ప్రారంభమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ టిక్కెట్ల ధర మాత్రం చాలా ఎక్కువ అయింది. ఈ ధర AED250 (INR 5400) నుండి ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 15న అమ్మకానికి వచ్చిన మొదటి బ్యాచ్ టిక్కెట్‌లు తక్షణమే అమ్ముడయ్యాయి. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు భారీ డిమాండ్ రావడంతో నిర్వాహకులు ఈ మ్యాచ్‌ల టిక్కెట్‌లను భారీ స్థాయిలో అమ్మాలని నిర్ణయించుకున్నారు. "నిర్వాహకుల ప్రకారం, ఇండియా-పాకిస్థాన్ టిక్కెట్లు ఇతర మ్యాచ్‌లతో కూడిన ప్యాకేజీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని దయచేసి గమనించండి" అని టోర్నమెంట్ టికెటింగ్ భాగస్వామి ప్లాటినం లిస్ట్ చెప్పారు.
రెండవ బ్యాచ్ టిక్కెట్లు బుధవారం ఉదయం ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. అభిమానులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. జనరల్ ఈస్ట్ మరియు వెస్ట్ (అత్యల్ప ధర టిక్కెట్లు) టిక్కెట్‌లు ఇప్పటికే అమ్ముడయ్యాయి, ప్లాటినం, ది గ్రాండ్ లాంజ్, స్కై బాక్స్ టిక్కెట్‌లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. నిర్వాహకులు ఫేక్ లింక్ లు, వ్యక్తుల నుండి టిక్కెట్లను కొనుగోలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. చాలా మంది ఎక్కువ ధరకు టిక్కెట్లను తిరిగి విక్రయిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోనున్నారు.


Tags:    

Similar News