షాహీన్ అఫ్రీది మీద పాక్ చాలా ఆధారపడి ఉంది

వికెట్లు తీయడానికి పాకిస్థాన్ ఎక్కువగా షాహీన్‌పై ఆధారపడిందని జావేద్ అభిప్రాయపడ్డాడు.

Update: 2022-08-22 14:53 GMT

ఆసియా కప్ 2022లో షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వారి జట్లపై చాలా ప్రభావం చూపుతుందని పాక్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. షాహీన్ అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా.. భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ లో పాల్గొనడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శనివారం (ఆగస్టు 20) నాడు మోకాలి గాయం నుండి కోలుకోవడానికి షాహీన్ కు నాలుగు-ఆరు వారాల పాటు విశ్రాంతి కావాలని తెలిపింది.

గత నెలలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు షాహీన్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుండి పాక్ జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఏ మ్యాచ్ కూడా ఆడలేదు. బుమ్రా వెన్నునొప్పితో పోరాడుతున్నాడు, అతనిని భారత ఆసియా కప్ 2022 జట్టు నుండి రెస్ట్ ఇచ్చారు. అక్టోబరు చివరిలో జరిగే T20 ప్రపంచ కప్ 2022 కోసం అతను కోలుకోవడానికి భారత సెలెక్టర్లు సమయాన్ని ఇచ్చారు. 2021 T20 ప్రపంచ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన మ్యాచ్ లో షాహీన్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. లెఫ్టార్మ్ పేసర్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను పెవిలియన్ కు చేర్చాడు. భారత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేశాడు.
వికెట్లు తీయడానికి పాకిస్థాన్ ఎక్కువగా షాహీన్‌పై ఆధారపడిందని జావేద్ అభిప్రాయపడ్డాడు. "బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్‌ అటాక్‌ బలహీనంగా మారింది. షమీ కూడా లేడు. కానీ పాక్ బౌలింగ్ అటాక్‌లో షాహీన్ లేకపోవడం పాక్ పై తీవ్ర ప్రభావం చూపనుంది "అని జావేద్ Paktv.tv కి చెప్పాడు. 'ఇది పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ. అతను బౌలింగ్ చేసే విధానం కారణంగా, T20 క్రికెట్‌లో బ్యాటర్లు LBW నుండి తమను తాము రక్షించుకోవాలా లేదా బౌలింగ్‌లో ఔట్ అయ్యే ప్రమాదం ఉందా అనే సందిగ్ధంలో పడుతున్నారు. కాబట్టి, షాహీన్ బౌలింగ్ చేసినప్పుడు బ్యాటర్లపై భారీ ఒత్తిడి ఉంటుంది, " అని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ కోసం పాక్ జాతీయ జట్టులో షాహీన్ అఫ్రిది స్థానంలో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ హస్నైన్ ఎంపికయ్యాడు.


Tags:    

Similar News