భారత్ దూకుడైన ఆటపై రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు

కోహ్లీ 2022లో భారత్‌ తరఫున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. రాహుల్ 2022లో టీ20ల్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా

Update: 2022-08-24 11:11 GMT

గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పేలవమైన ప్రదర్శన తర్వాత భారత జట్టు ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయి. టీ20లలో చాలా బలమైన జట్టుగా భారత్ ఎదుగుతూ ఉంది. ఇటీవలి కాలంలో భారత్ ఆడుతున్న తీరును చూస్తే మనకు స్పష్టంగా ఆ విషయం తెలుస్తుంది. టీ20 క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న భారత్ కు ముఖ్యంగా ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత జట్టు ఆటతీరు ఇలా ఉండేది కాదని అప్పటి కోచ్ రవిశాస్త్రి కూడా అంగీకరించాడు. తను కోచ్‌గా ఉన్నప్పుడు కూడా భారత టాపార్డర్ మెతకగా ఉందని అనుకునే వాళ్లమని, ప్రస్తుతం ఉన్న ఎగ్రెసివ్ ఆటతీరునే భారత్ కొనసాగించాలని రవిశాస్త్రి సూచించాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కొత్త అటాకింగ్ విధానం సరైనదని రవిశాస్త్రి అన్నాడు. రోహిత్-ద్రావిడ్ యుగంలో మెన్ ఇన్ బ్లూ T20I క్రికెట్‌లో కొత్త బ్రాండ్ క్రికెట్‌ను ఆడుతున్నారన్నారు. భారతదేశం దూకుడుగా బ్యాటింగ్ విధానాన్ని అవలంబించడం వారికి చాలా ప్రయోజనం చేకూర్చిందన్నారు.

''జట్టు లోయర్ ఆర్డర్‌లో ఉన్న ఆటగాళ్ల సత్తాను దృష్టిలో పెట్టుకుంటే.. టాపార్డర్ రెచ్చిపోవాలి. కానీ నేను కోచ్‌గా ఉన్నప్పుడు అలా జరగలేదు. దీనిపై మేం కూడా చాలాసార్లు చర్చించాం. ఇప్పుడు సరైన పద్ధతిలోనే టీమిండియా వెళ్తోంది. మధ్య మధ్యలో కొన్ని మ్యాచులు ఓడిపోతాం.. కానీ ఈ పద్ధతిలో గెలిస్తే ఆ కాన్ఫిడెన్స్‌తో కీలకమైన మ్యాచుల్లో కూడా ఇదే పద్ధతిలో ఆడొచ్చు'' అని అన్నారు రవి శాస్త్రి. "వారు ఈ విధానాన్ని మార్చుకోకూడదు. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కూడా మేము టాప్ ఆర్డర్ దూకుడుగా ఆడడం గురించి చర్చించుకున్నాము, "అని శాస్త్రి చెప్పారు.
విరాట్ కోహ్లి, KL రాహుల్ ద్వయం T20I లలో భారత జట్టుకు ఇన్ని రోజులు దూరంగా ఉంది. ఇప్పుడు ఆసియా కప్ 2022లో తిరిగి జట్టులోకి రానుండడం భారత్ కి మరింత బలం ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే కోహ్లీ ఫామ్ భారత్ ను టెన్షన్ పెడుతోంది. కోహ్లీ 2022లో భారత్‌ తరఫున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. రాహుల్ 2022లో టీ20ల్లో భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2022లో ఎక్కువ టీ20లు ఆడనప్పటికీ, కోహ్లి, రాహుల్‌లు భారత్‌ కొత్త అటాకింగ్‌ విధానానికి సులభంగా అలవాటు పడగలరని శాస్త్రి అభిప్రాయ పడ్డారు. "వారు చాలా అనుభవం ఉన్న ఆటగాళ్లు. వారు తగినంత IPL, T20లు ఆడారు. అందుకు తగ్గట్టుగా అలవాటు పడడం కష్టం కాదు. టాపార్డర్ విఫలమైనా.. రిషబ్, హార్దిక్, జడేజాలతో మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఇన్నింగ్స్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి తగినంత బ్యాటింగ్ డెప్త్ ఉంది." అని చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News