ఆసియా కప్ కు విరాట్ కోహ్లీ స్పెషల్ డైట్..!
ఒకప్పుడు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటూ ఎంతో లావుగా ఉండేవాడు విరాట్ కోహ్లీ.
భారత జట్టు ఆసియా కప్ లో పోరాడడానికి సిద్ధమవుతూ ఉంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో భారత్ తలపడబోతోంది. భారత జట్టులో విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన ఇచ్చి చాలా రోజులే అవుతోంది. విరాట్ ఆసియా కప్ లో రాణిస్తాడని అందరూ భావిస్తూ ఉన్నారు.
ఆసియా కప్ కు వెళ్లే ముందు విరాట్ కోహ్లీ స్పెషల్ డైట్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు. ఒకప్పుడు ఇష్టం వచ్చిన ఫుడ్ తింటూ ఎంతో లావుగా ఉండేవాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పుడు ఫుడ్ పై కంట్రోల్ పెట్టి.. ఫిట్నెస్ కు సరికొత్త డెఫినిషన్ గా మారాడు. ఒకప్పుడు బొద్దుగా ఉండే విరాట్ కోహ్లీ తనను తాను మార్చుకున్నాడు. అది ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్ లలో ఒకడిగా మారడానికి అతనికి సహాయపడింది. 2013-14 నుండి, కోహ్లీ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఛోలే భాతురేను ఇష్టపడే కోహ్లి, ఫిట్‌గా, షేప్‌లో ఉండేందుకు అందుకు దూరంగా ఉన్నాడు. కోహ్లీ తన ఫిట్నెస్ ను కాపాడుకోడానికి చాలా త్యాగాలు చేసాడు, ఆ త్యాగాలు అతడికి అన్ని విజయాలను అందించింది.
ఆసియా కప్ కు వెళ్ళడానికి ముందు కోహ్లీ తన విషయంలో చాలా మార్పులు చేసుకుంటూ కనిపిస్తున్నాడు. కోహ్లీ బేసిక్స్‌కి తిరిగి వెళ్ళాడు. ఆసియా కప్‌కు ముందు అతను ప్రత్యేకమైన డైట్‌ని అనుసరిస్తున్నాడు. ఇది షుగర్ మరియు గ్లూటెన్-ఫ్రీ డైట్ అని తెలుస్తోంది. అతను డైరీ ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉంటున్నాడు. "నేను డైట్, ఫిట్‌నెస్‌పై ఒకప్పుడు దృష్టి పెట్టే వాడిని కాను, కానీ గత కొన్ని సంవత్సరాలుగా తినే విధానాన్ని మార్చుకున్నాను. మరింత క్రమశిక్షణతో ఉన్నాను. నేను ఎల్లప్పుడూ నా ఆహారం గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాను' అని విరాట్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకం అవ్వనుంది. పాక్‌తో భారత్ తలపడే మ్యాచ్ కోహ్లీకి 100వ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. గతేడాది ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించిన చోటే భారత్ మరోసారి పాకిస్థాన్ తో తలపడనుంది. వచ్చే ఆసియా కప్ కోసం కోహ్లీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించాడు. ముంబైలోని బికెసి కాంప్లెక్స్‌లో కోహ్లీ వీడియోలు వైరల్ అయ్యాయి.