టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ..
కోర్టు ధిక్కణ కేసులో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టు నెలరోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు మంగళవారం తీర్పునిచ్చింది. ఈనెల 27వ తేదీలోగా ధర్మారెడ్డి జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. గతంలో ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు తమ క్రమబద్దీకరణపై హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. ముగ్గురినీ క్రమబద్దీకరించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది.
కోర్టు ఉత్తర్వులను టీటీడీ పాటించలేదంటూ.. ఆ ఉద్యోగులు తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించింది.