BiggBoss6 Finale Week : వాళ్లిద్దరి జర్నీలను ఎంతో అందంగా చూపించిన బిగ్ బాస్.. ఎమోషనల్ అయిన కంటెస్టంట్లు

ఇప్పుడు వ్యక్తిత్వానికి చెందిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. మీ కోపం బలహీనతగా..

Update: 2022-12-13 06:41 GMT

bigg boss finale week,

బిగ్ బాస్ సీజన్ 6 చివరిదశకు చేరుకుంది. ఫినాలే వీక్ మొదలైపోయింది. మరో ఐదురోజుల్లో గ్రాండ్ ఫినాలే రాబోతోంది. విన్నర్ ఎవరన్న దానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులుండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో ఒకరు బయటికి రానున్నారు. ఇక గ్రాండ్ ఫినాలేకి 5గురు సభ్యులుంటారు. బిగ్ బాస్ కంటెస్టంట్ల జర్నీలను చూపిస్తున్నారు. ఇందుకోసం గార్డెన్ అంతా అందంగా ముస్తాబు చేశారు. ముందుగా రేవంత్ ను పిలిచిన బిగ్ బాస్.. గార్డెన్లో అతని ఫోటోలను పెట్టారు. చిన్న వేదికను ఏర్పాటు చేయగా.. రేవంత్ దానిపై నిలబడ్డాడు. వెంటనే భార్య అన్విత నుండి కాల్ వచ్చింది. గెలిచి టైటిల్ విన్ అవ్వాలని చెప్పింది.

ఆ తర్వాత బిగ్ బాస్ రేవంత్ గురించి కొద్దిసేపు మాట్లాడాడు. "ఇప్పటివరకు పాటల పోటీల్లో మీరు గెలిచారు.ఇప్పుడు వ్యక్తిత్వానికి చెందిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఓటమిని తీసుకోలేని మీ మనస్తత్వం చుట్టూ ఉన్న వారు వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇచ్చింది. మీరు కోపాన్ని పాషన్‌గా మార్చారు. అది మీ పట్టుదలను రెట్టింపు చేసింది. ఆకలి టాస్కుల్లో ఎంత చూపించారో, ఇంట్లో కూడా అంతే చూపించారు. దాచుకుని తినడంలో మీలోని చిన్న పిల్లాడి అమాయకత్వాన్ని బిగ్‌బాస్ గమనించారు. అన్ని భావాలను కలిగిన వారే నిజమైన విజేతలు. అవన్ని దాచుకోకుండా మీరు చూపించిన తీరు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. జీవితంలో తండ్రయ్యే ముఖ్యమైన క్షణాలను వదులుకుని ఇంటి సభ్యులకు దూరంగా ఉన్నా గెలుపు కోసం ఎక్కడిదాకానైనా వెళ్లాలనే కోరికే మిమ్మల్ని ముందుకు నడిపింది" అvf చెప్పుకొచ్చాడు బిగ్‌బాస్. ఆ తరువాత అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. హౌస్ లో తన జర్నీ చూసుకుని రేవంత్ కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ తర్వాత శ్రీసత్యను పిలిచారు. ఆమె తన అక్కతో మాట్లాడింది. ఆమె గురించి బిగ్‌బాస్ చెబుతూ 'పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషికి మొదటి విజయం. ఆ పట్టుదల, మొండితనం రెండూ మీలో ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు... మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికారు. ఇక్కడ మీ ప్రయాణాన్ని సులువు చేశారు' అని చెప్పి.. తన జర్నీని చూపించారు. శ్రీసత్య కూడా తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఆదిరెడ్డి జర్నీకి సంబంధించిన ప్రోమో వచ్చింది.


Tags:    

Similar News